బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 07, 2020 , 00:55:11

రూ.4 కోట్లతో గ్రంథాలయం నిర్మాణం

రూ.4 కోట్లతో గ్రంథాలయం నిర్మాణం

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ : బడంగ్‌పేట్‌లో జిల్లా గ్రంథాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. గురువారం మంత్రి చాంబర్‌లో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రమణకుమార్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కేంద్ర లైబ్రరీ నమూనా మ్యాప్‌ను పరిశీలించారు. సుమారు రూ.4కోట్ల నిధులతో 2వేల గజాలలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న జిల్లా లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ముగిసిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు వికారాబాద్‌లో రంగారెడ్డి జిల్లా కేంద్ర లైబ్రరీ ఉండేదని, పునర్విభజనలో వికారాబాద్ జిల్లాగా ఏర్పాటు కాగా, రంగారెడ్డి జిల్లాకు కేంద్ర లైబ్రరీ భవనం లేకుండా పోయిందన్నారు. దీంతో మంత్రి సబితారెడ్డి నూతన భవనంపై దృష్టి సారించి, బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అర ఎకరా స్థలాన్ని నూతన భవనం కోసం ఎంపిక చేశారు. 


logo
>>>>>>