డెహ్రాడూన్: తానూ ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను రాస్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం తీరథ్సింగ్ చెప్పారు. ఈ క్షణం నుంచి అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రజల అంచనాలకు తగ్గట్టే నడుచుకుంటానని ఆయన తెలిపారు. గత నాలుగేండ్ల తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.