ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Feb 05, 2020 , 01:19:56

నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ

నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ టూరిజం, వూటీ అండ్‌ హల్దీ గోల్ఫ్‌ కౌంటీ సహకారంతో ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఆఫ్‌ ఇం డియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఆరవ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ మొదలుకాబోతున్నది. ఈనెల 8వ తేదీ వరకు జరిగే టోర్నీలో మొత్తం 126 మంది ప్రొఫెషనల్‌ గోల్ఫర్లు పోటీపడబోతున్నట్లు మంగ ళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు పేర్కొన్నారు. గతేడాది టూర్‌ చాంపియన్‌షిప్‌ విజేత ఉదయన్‌ మానెతో పాటు వూటీ గోల్ఫ్‌ కౌంటీ మద్దతుతో జాతీయ స్థాయి యువ గోల్ఫర్లు తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భారత ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ క్రీడాకారులకు తో శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. టోర్నీ ప్రైజ్‌మనీగా రూ.40 లక్షలుగా నిర్వాహకులు ప్రకటించారు. గోల్కొండ మాస్టర్స్‌ టోర్నీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని వూటీ అండ్‌ హల్దీ గోల్ఫ్‌ కౌంటీ సీఈవో పృథ్వీ రెడ్డి అన్నారు. యువ గోల్ఫర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.   logo