శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Feb 05, 2020 , 01:18:10

క్యాన్సర్‌ను అంతం చేద్దాం

క్యాన్సర్‌ను అంతం చేద్దాం

ఖైరతాబాద్‌: క్యాన్సర్‌ను సమూలంగా అంతం చేద్దాం....‘కిల్‌ క్యాన్సర్‌' నినాదంతో ఇస్కాన్‌ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా అవగాహన 5కే రన్‌ నిర్వహించారు. ఈ రన్‌ను రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్త, టాటా ట్రస్ట్‌ ప్రతినిధి వెంకట్‌ రావు, ఇస్కాన్‌ డైరెక్టర్‌ మహాశృంగదాస, అధ్యక్షులు డాక్టర్‌ సహదేవ్‌ దాసు, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, వాసవి సేవా కేంద్రం ప్రతినిధి బొగ్గారపు దయానంద్‌తో కలిసి ప్రారంభించారు. సుమారు ఐదువేల మంది యువతీ, యువకులు, వివిధ కళాశాల లు, పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రన్‌ పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్‌ వరకు కొనసాగింది. కోలేటి దామోదర్‌గుప్త మాట్లాడుతూ భారతీయ ఆయూర్వేదంలో క్యాన్సర్‌కు అద్భుతమైన చికిత్స విధానం ఉందన్నారు. సహజంగా ఇంట్లో వంటలకు వాడే పసుపు, అల్లం, తేనేలో క్యాన్సర్‌ను నివారించే గుణాలు ఉన్నాయన్నారు. ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనే వేసుకొని తాగితే భవిష్యత్తు క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారన్నారు.  మహాశృంగదాస మాట్లాడుతూ అన్ని వ్యాధులకు మూలం జీవన విధానం, ఆహారపు అలవాట్లని, అందులో మార్పులు చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మద్యం, పొగా కు ఉత్పత్తులు, మాంసం, ఫాస్ట్‌ ఫుడ్‌ను త్యజించాలన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి కళాశాలకు వెళ్లి క్యాన్సర్‌పై అవగాహన కోసం వకృత్త పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా వారి కుటుంబాలకు పిల్లలు అవగాహన కల్పిస్తారన్నారు.  ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్‌ సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.


logo