మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Feb 02, 2020 , 01:13:30

కాలుష్య నివారణపై ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రశంస..

కాలుష్య నివారణపై  ఎలక్ట్రిక్‌ బస్సులకు  ప్రశంస..
  • ‘గ్రేటర్‌ ఆర్టీసీ’కి జాతీయ స్థాయిలో గుర్తింపు
  • నగరంలో ప్రయాణిస్తున్న 40 బస్సులు
  • మరో 120 ఎలక్ట్రిక్‌ బస్సులు రాక..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తెలంగాణలో కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.   తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ముందడుగు వేస్తూ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. అందులోభాగంగానే హైదరాబాద్‌ నగరంలో ఆపరేట్‌ చేస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సుల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ దేశంలోనే మొదటి వరుసలో నిలిచింది. ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్‌ బస్సులను సమర్థ్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు ఏఎస్‌ఆర్‌టీయూ వంటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. వాయు కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యల్లో తమవంతు కృషిచేస్తూ టీఎస్‌ఆర్టీసీ దేశంలో ప్రత్యేకతను చాటుకుంటూ దేశంలోని 64  ప్రజా రవాణా సంస్థలను వెనక్కినెట్టి అగ్రభాగాన నిలుస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బ్యాటరీ ఆపరేటెడ్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. కాగా మొదటిదశలో భాగంగా 40 ఎలక్ట్రిక్‌ బస్సులను అం దుబాటులోకి తెచ్చి ఆపరేట్‌ చేస్తున్నారు. బస్సులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఏయిర్‌పోర్టుకు నడుపుతున్నారు. శబ్ధ, వాయు కాలుష్యం లేకుండా బస్సు లు నడుస్తున్నాయి. 


ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లు

నగర రోడ్లపై రాకపోకలు సాగిస్తున్న  ఎలక్ట్రిక్‌ బస్సులు ఒకసారిచార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 12 మీటర్ల పొడవుతో ఉన్న ఈ బస్సులో 39 మంది ప్రయాణికులు, డ్రైవర్‌తో కలిసి 40 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశమున్నది.  సీనియర్‌ సిటిజన్‌ ప్రయాణికులు ఎక్కిదిగేందుకు వీలుగా బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత  లిథియం ఇయాన్‌ బ్యాటరీతో చార్జింగ్‌ చేసే బ్యాటరీని 4 నుంచి 5 గంటలు చార్జ్‌ చేస్తే పూర్తిగా చార్జ్‌ అవుతుంది. ఇందులో ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరుగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ కలిగిఉంటుంది. ఈ వాహనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నడిపిస్తున్నది. ఈ వాహనాలు సక్సెక్‌ కావడంతో మరిన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. అయితే మరో 120 ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి రానున్నాయి.logo
>>>>>>