ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Feb 01, 2020 , 04:23:52

దోమలపై డ్రోన్‌ యుద్ధం

దోమలపై డ్రోన్‌ యుద్ధం

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా దోమలకు చెక్‌ పెట్టేందుకు దోమల ఆవాస కేంద్రాలైన చెరువులు, మూసీ నదిలో డ్రోన్‌ ద్వారా మందులు చల్లిస్తున్నారు. ఈ ప్రక్రియను జనవరి 27న ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని నాగోలు చెరువులో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి ప్రారంభించారు. తొలి రెండు రోజుల పాటు నాగోలు చెరువులో దోమల నివారణ మందును డ్రోన్‌తో చల్లించిన అధికారులు, తాజాగా బండ్లగూడ చెరువులో స్ప్రే చేయిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌, బైరామల్‌గూడ చెరువు, మూసీనది, ఇరువైపుల గడ్డిపొలాలతో పాటుగా అన్ని చెరువుల్లో డ్రోన్‌ల సహాయంతో దోమల నివారణ మందు స్ప్రే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 


logo