శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 28, 2020 , 03:15:17

ఇన్‌స్టాగ్రామ్‌తో ఏడిపిస్తున్నారు..!

ఇన్‌స్టాగ్రామ్‌తో ఏడిపిస్తున్నారు..!
  • - పిల్లలపై సోషల్‌మీడియా దుష్ప్రభావం
  • - మంచి, చెడులను వివరించలేని స్థితిలో ఉపాధ్యాయులు
  • - హైస్కూల్‌ చదువులోనే నకిలీ ఖాతాలతో ఆటలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పదో తరగతి విద్యా ర్థి తన తోటి విద్యార్థినిని ఏడ్పించాలనుకున్నాడు.. అందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకున్నా డు..ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్నేహితుడి పేరుతో ఒక ఖాతాను తెరిచాడు.. ఆ ఖాతాతో తోటి స్నేహితురాలికి అసభ్యకరమైన మేసేజ్‌లు పెడుతున్నాడు. దీం తో ఆ బాలిక ఆందోళనకు గురై తన తండ్రికి ఈ విషయాన్ని  చెప్పింది.. వెంటనే తండ్రి ఆ ఖాతా ఎవరి పేరుతో ఉందో ఆ బాలుడి ఇంటికి వెళ్లి ఆరా తీశా డు.. అంకుల్‌ తనకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లేదు.. నేను ఫోన్‌ ఎక్కువగా వాడనంటూ చెప్పాడు.. అయి తే తన కూతురిని ఏడ్పిస్తుంది ఎవరంటూ ఆ బాలిక తండ్రి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.. ఈ కేసులో ఖాతా వివరాలను ఆరా తీసిన ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం.. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వాడుతుందెవరో తేల్చారు.. ఖాతా వాడుతున్నది.. బాధితురాలు చదువుకుంటున్న స్కూల్‌లోనే తోటి విద్యార్థి అని నిర్ధారించారు. సదరు విద్యార్థి తన తండ్రితోపాటు తల్లి ఫోన్ల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు పలిపించి బాలుడితోపాటు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. విషయం పూర్తిగా తెలిసిపోయిందని గుర్తించిన బాలుడు ఇదంతా చేసింది నేనేనంటూ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. దీంతో బాలుడితోపాటు తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 


ఇది  ఒక ఘటనే కాదు.. 

సోషల్‌ మీడియా పిల్లలను ఆకర్షించి వారిపై దుష్ప్రభావా న్ని చూపుతుందని చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలు హైస్కూల్‌, ఇంటర్‌ చదువుతున్నారంటే ప్రతి తల్లిదండ్రులు టెక్నాలజీ వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే భయంతో ఉండే పరిస్థితి ఏర్పడింది. కొందరు పిల్లలు మాత్రం టెక్నాలజీని సరైన రీతిలో వాడు తూ తల్లిదండ్రులలో సంతోషాన్ని నింపేవారు సైతం ఉన్నా రు. తెలిసి తెలియన వయస్సులో సోషల్‌మీడియాకు ఆకర్షితులవుతూ పిల్లలు తప్పుటడుగులు వేస్తుండడంతో.. అలాంటి ఘటనలు కొన్ని పోలీస్‌స్టేషన్ల వరకు వస్తున్నాయి. తమ పరువు తీశావంటూ తల్లిదండ్రులు పిల్లలపై కోపపడడంతోపాటు మనో వేదనకు గురవుతున్న వారున్నారు. 


ధ్యాసంతా ఫోన్లపైనే...!

పాఠశాలలు, కాలేజీల నుంచి తిరిగి ఇంటికి వచ్చాన తరువాత.. ఉదయం నిద్ర లేవగానే.. పడుకోకముందు మా ఫ్రెండ్స్‌ ఏమి మేసేజ్‌ పంపించారు.. నేను పెట్టిన ఫోటోలకు ఎలాంటి కామెంట్స్‌ వచ్చాయి.. నా పోస్టింగ్‌ను ఎంత మం ది చూశారనే ధ్యాసతో చాలామంది పిల్లలు సెల్‌ఫోన్‌తోనే గుడుపుతున్నారు.  కాలం మారుతుంది.. టెక్నాలజీనే మనిషిని శాసించేస్థాయికి వచ్చేసింది. పాఠశాల నుంచి రాగానే హోంవర్క్‌ చేసుకొని కొద్దిసేపు ఆటలు అడే పరిస్థితి లేదు.. ఇంట్లో ఉన్న అమ్మనాన్న.. తాత నానమ్మలు.. అక్క చెల్లి.. అన్నతమ్ముడితో మాట్లాడుకునే సమయం ఇవ్వడం లేదు. ఇంటికి వచ్చామా.. సెల్‌ఫోన్‌ పట్టుకొని కూర్చున్నామా అనే చాలామంది చూస్తున్నారు. పిల్లల చేష్టలతో తల్లిదండ్రులు ఎవరికి  చెప్పుకోలేని నిస్సాయస్థితిలో ఉన్నారు. పాఠశాల ల్లో కూడా పిల్లలకు పాఠాలతోపాటు సంస్కారం నేర్పడం మానేశారు.. ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలను చెప్పడం లేదు. పాఠశాలలోకి కొందరు పిల్లలు సెల్‌ఫోన్లు తీసికెళ్తున్నా.. పట్టించుకునే వారులేరు.. సోషల్‌మీడియాలో అప్రమత్తంగా లేకుంటే.. తమకేమి తెలియని వారనకుంటారనే బావనతో కొందరు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ఖాతాలు తెరుచుకుంటున్నారు. సోషల్‌ మీడియా పిల్లలపై చూపే చెడు ప్రభావంపై ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయు లు తమ విద్యార్థులలో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరముంది. కేవలం ఉపాధ్యాయులపైనే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్లో కన్పించే మార్పుల గూర్చి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడం.. సోషల్‌మీడి యా దుష్ప్రభావం గూర్చి పిల్లలకు అర్ధమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర పోషిస్తూ పాఠశాలల్లో చెప్పే మాటలు వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయనే విషయాన్ని ఉపాధ్యాయులు గమనిస్తూ.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పిల్లలను సోషల్‌మీడియాకు దూరంగా ఉంచేట్లు చేయడం మంచిది. 


గ్యాంగ్‌లుగా విద్యార్థులు

కొందరు విద్యార్థులు సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు గొడవలు దారి తీస్తున్నాయి. అల్వాల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టాడు. అది పదోతరగతి విద్యార్థికి వ్యతిరేకంగా పోస్టు పెట్టావంటూ దానికి కొందరు విద్యార్థులు బదులిస్తూ రెండు గ్యాంగ్‌లు మారిపోయారు. పాఠశాలస్థాయిలోనే విద్యార్థులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి సోషల్‌మీడియాలో కామెంట్లు చేసుకున్నారు. ఈ కామెంట్లతో రెండు గ్యాంగ్‌ల మధ్య బయట గొడవకు కూడా దారితీశాయి. పాఠశాలల్లో కూడా సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టుల గూర్చి పిల్లలు చర్చించుకుంటున్నారంటే విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది.


logo