శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 26, 2020 , 02:32:03

గుబాళించిన గులాబీ

గుబాళించిన గులాబీశంషాబాద్‌, మణికొండ, బండ్లగూడ: మున్సిపల్‌ చరిత్రలో మరోసరి కొత్త అధ్యాయంగా శనివారం వెలువడిన శంషాబాద్‌ నూతన మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ వ్యూహాలు ఫలించాయి. నియోజకవర్గంలోను, శంషాబాద్‌ మున్సిపాలిటీలోను గులాబీ మరోసారి గుబా ళించింది. ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు పట్టం గట్టారు. 25 వార్డులకు గానూ 14 స్థానాలను కైవసం చేసుకొని సింగిల్‌గా మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించిన టీఆర్‌ఎస్‌ శంషాబాద్‌ నూతన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ గిరి సాధించే దిశగా దృష్టి సారించారు. సంచలన విజయంతో ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ప్రభంజనానికి ప్రధానకారణాలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రథసారథి సీఎం కేసీఆర్‌ మొక్కవోని దీక్ష, మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకాలు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నాయకత్వం, ధృఢసంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శ నమని, ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే కారణాలంటున్నారు రాజకీయ విశ్లేష కులు. కోర్టుకేసులు, ఎన్నికలపై ప్రతపక్షాల అనుమనాలు, గందరగోళం వాతావరణం.. సవాల్‌ ప్రతి సవాల్‌ వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లిన పార్ట్టీ గెలువబోదనన్న వారి అంచనాలు తల కిం దులు చేస్తూ విజయాన్ని చేజిక్కించుకుంది. గులాబీజెండా ఎగురవేస్తామని ప్రకాశ్‌గౌడ్‌ తన మాట నిలబెట్టుకున్నారు. అనుమానాలు, అపోహలతో అయోమయానికి గురిచేసిన అన్ని సర్వేల ఫలితాలు ఉత్తుత్తవేనని ప్రజలు తీర్పుఇచ్చారు. విపక్షాలు ఊహించని విధంగా తమ అనుకూలురు ఓటమి పాల వడం జీర్ణించుకోలేకపోతున్నారు. కాదుకాదన్న కలను నిజం చేసిన ఉద్యమపార్టీకి ప్రజలు 2018 నుంచి జరిగిన 4 ఎన్నికల్లో నీరాజనం పట్టారు. మరోసారి ఇప్పుడు అంతే ఉత్సాహంతో ప్రజావిజయంగా గులాబీసర్కార్‌కే పట్టం గట్టారు.

కారు ప్రభంజనం.....!

శంషాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో 14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం అభ్యర్థులు సాధించారు. ఉదయమే నేతలు, ఏజెంట్లు,  అభ్యర్థులు కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. 6.30గంటలకు లోపలికి అభ్య ర్థుల ను, ఏజంట్లను పంపినారు. వారి సమక్షంతోనే బ్యాలట్‌ బాక్స్‌లను తెరిచారు. అధికారుల సమక్షంలో టేబుల్స్‌పై లెక్కింపు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఓట్ల ఆధిక్యతతో ముందంజలోకి దూసుకుపోయినారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఉదయం నుంచి  ఫలితాలను సమీక్షించారు. మొదటిసారి రౌండ్‌లో  కేవలం 5 స్థానాలకే పరిమితం కాగా,  అనంతరం ఉత్కంఠగా పలువురు మెజార్టీతో తదుపరి, చివరి రౌండ్‌లో అత్యధిక ఆధిక్యతతో గెలుపు సాధించారు. మొత్తం 9 వంతున రౌండ్లలో కొనసాగింది. పలువురు మెజార్టీతో దూసుకుపోయారు. మధ్యాహ్నం వరకు వెనకముందు రావడం కొంత కలవరపెట్టింది. తర్వాత విజయానికి చేరువలోకి వెళ్లారు. ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు, సంపూర్ణ ఏర్పాట్ల మధ్య సజావుగా కొనసాగింది. ప్రతి రౌండ్‌ ఉత్కంఠ రేపింది. ప్రతిరౌండ్‌లోను అభ్యర్థులు ఆధిక్యతలోనే కొనసాగారు. ఉదయం 11.30 వరకు కేవలం 5 మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపందుకున్నాయి. మధ్యాహ్నానికి  ఫలితాలు వెలువడినవి. రెట్టింపు మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గులాబీదళంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సంబురాలకు సన్నాహాలు చేస్తున్నారు. గులాబీ జెండా రెపరెపలాడింది. గులాబీ సేనల అహోరాత్రుల పోరాటం ఫలించింది. ఇక శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎవరిని విజయం వరిస్తుందో అన్న చర్చనీయాంశం కొనసాగుతుంది.  భద్రతా ఏర్పాట్లను డీసీపీ ప్రకాశ్‌రెడ్ది సమీక్షంచారు. లోపలకు ప్రవేశించేందుకు కట్టుదిట్టమైన నిషేధిత ఆజ్ఞలను అమలు చేశారు. అడుగడుగున లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మీడియా పాయింట్‌ వద్దకు మాత్రమే మీడియా ప్రతినిధులను అనుమతించారు. అక్కడ ఓ అధికారి ఆయా మున్సిపాటీల ఫలితాలను రౌండ్ల వారీగా వెల్లడించారు. వేలాదిగా ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల ప్రజలు  తరలివచ్చారు. జనాల సందడితో కోలాహలంగా మారింది. అదే విధంగా ఆయా అభ్యర్థులు విజయం సాధించిన వారు కౌంటింగ్‌ ప్రాంతానికి చేరుకోగా వారి అభిమానులు జయజయ నినాదాలు, సందడితో హోరెత్తించారు.
మరింత ఉత్సాహంతో ప్రగతి: ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

అసెంబ్లీ, ఎంపీ, మండల, జడ్పీటీసీ, పంచాయతీల మాదిరి మరోసారి ఇప్పుడు అంతే ఉత్సాహంతో ప్రజావిజయంగా గులాబీసర్కార్‌కే పట్టం గట్టారని తెలిపారు. మన నేలకు మన నేత పాలకుడు.. మా బతుకులకు దేవుడు...అంటూ ఉద్యమం లోనే కాదు.. పాలనలోను అదే ఒరవడి. అనుమనాలను పటాపంచలు చేసి అసలు ఎవరి ఆలోచనలు అందని తీరుతో అద్భుత పాలనను అందిస్తూ సీఎం కేసీఆర్‌.. అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్‌, పేదలకు డబుల్‌బెడ్‌రూం, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, మైనార్టీల సంక్షేమం, కేసీఆర్‌ కిట్‌, కులాలవారీగా ఆర్థికస్వావలంభనకు పథకాలు..ఇలా ఒకటేమిటి ? దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలతో బంగారుతెలంగాణ వైపు వడవడిగా కదులుతున్న సమయాన మన రాష్ట్రం మన పాలనకు మరోఅద్భుత అవకాశాన్ని ఆ విజయరథ సారధికే తమ ఓట్ల దీవీనెలతో అందజేశారని వివరించారు. సకలజన హృదయనేత కేసీఆరే అంటూ పరిసత్‌లోను మరోసారి పట్టం గట్టారన్నారు. శంషాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడంలో మున్సిపోల్‌ విజయం ఊతమిస్తుందన్నారు. మున్సిపల్‌ విజయం అభినందనీయమని ప్రశంసించారు. ఈనెల 27న శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌  ఎంపిక నిమిత్తం ఈసీ  నోటీసులు జారీ చేసినమేరకు అధికారులు తగు ఏర్పాట్లతోపాటు సన్నాహాలు చేస్తున్నారు.

సజావుగా.... కౌంటింగ్‌

హిమాయత్‌సాగర్‌ పరిధిలో ఉన్న లార్డ్స్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంల్లో బ్యాలట్‌ బాక్స్‌లను భద్రపరచడం, కౌంటింగ్‌ సజావుగా ముగించారు. సీసీకెమెరాల నిఘా, రాష్ట్ర పోలీ సు సీఆర్‌పీఎఫ్‌, వివిధ మూడంచెల భద్రత మధ్య ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్‌ హరీశ్‌కుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఆర్డీఓ చంద్రకళతోపాటు శంషాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాముండేశ్వరి,  డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పర్యవేక్షించారు. ఎన్నికల ఉన్నతాధికారుల స్వీయపర్యవేక్షణ చేయడం జరిగింది. కౌంటింగ్‌కు సంబంధించి ప్రవేశ తనిఖీల నాకాబందీలు, బారికెడ్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు.
logo