శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 26, 2020 , 02:22:23

సోషల్‌ మీడియాలో.. కారు చక్కర్లు..!!

సోషల్‌ మీడియాలో.. కారు చక్కర్లు..!!
  • - మున్సిపల్‌ విజయ దుందుభిపై అభినందల వెల్లువ
  • - ఫలించిన తారక మంత్రం..
  • - ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ రామన్న..
  • - టిట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లో ‘జై కేసీఆర్‌.. జై టీఆర్‌ఎస్‌.. జైజై రామన్న’ అంటూ పోస్టులు
  • - కారుకే జై కొట్టిన నెటిజన్లు
  • - గులాబీ రంగు అద్దుకున్న ప్రొఫైల్‌ పిక్స్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సోషల్‌ మీడియాలో గులాబీ గుబాళించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయడంతో సామాజిక మాధ్యమంలో ‘జై టీఆర్‌ఎస్‌..జై రామన్న.. జై కేసీఆర్‌..ఫలించిన తారకమంత్రం, ఫ్యూచర్‌ ఆఫ్‌ తెలంగాణ’ అంటూ పోస్టులు వెల్లువెత్తా యి. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో దూసుకుపోతు న్న కారు బొమ్మలను నెటిజన్లు విరివిగా షేర్‌ చేశారు. సృజనాత్మకత రంగరంచి కారు ఫొటోలను చక్కర్లు కొట్టించారు. ఎన్నికల ఫలితాలు ప్రారంభమైన ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘గెలుపు ఊహించిందే.. సరిలేరు కారుకెవ్వరూ’ అంటూ ప్రతిపక్షాలను హడలెత్తించేలా పోస్టులు వాల్స్‌పై వెలిశాయి. అనుకున్నట్టుగానే విజయం చేకూరడంతో నెటిజన్లు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

వ్యక్తిగత దూషణలకు దిగినా..!!

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ సోషల్‌ మీడియాను విరివిగా ఉపయోగించాయి. తాము చేసిన పను లు.. ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ ప్రచారం సాగించగా.. ప్రతిపక్షాలు మాత్రం వ్యక్తిగత దూషణలకే పరిమితమయింది. అవాస్తవాలను ప్రచారం చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. అనవసర విమర్శలతో సామాజిక మాధ్యమంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసింది. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. కానీ నెటిజన్లు ఏ మాత్రం వాటిని పట్టించుకోకపోవడం విశేషం. సాధరణ ప్రజలు సైతం జై టీఆర్‌ఎస్‌ అం టూ పోస్టులు షేర్‌ చేయడం కనిపించింది. సోషల్‌ వారియర్స్‌ ప్రతిపక్షాల ఎత్తులను తిప్పికొట్టి వాస్తవాలను నెటిజన్ల ముందుంచారు.


గులాబి రంగు అద్దుకున్న కేటీఆర్‌ ట్విట్టర్‌..!!

సోషల్‌ మీడియాలో కేటీఆర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌కు చాలా క్రేజ్‌ ఉంది. సామాన్యులకు ఆపదొచ్చినా..కష్టమొచ్చినా.. అన్యా యం జరిగినా నెటిజన్లు కేటీఆర్‌ ట్విట్టర్‌కే తమ గోడు వెల్లబోసుకుంటారు. నిమిషాల్లో ఆ సమస్యపై కేటీఆర్‌ నుంచి స్పందన రావడమే అందుకు కారణం. దీంతో నెటిజన్లు కేటీఆర్‌ ట్విట్టర్‌ను అధిక సంఖ్యలో ఫాలో అవుతుంటారు. నెటిజన్లు మున్సిపల్‌ ఎన్నికల విజయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌ ట్విట్టర్‌కు ట్యాగ్‌ చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ‘జై కేసీఆర్‌.. జైజై రామన్న’ అంటూ పోస్టులు  వెల్లువెత్తాయి. కేటీఆర్‌ ట్వీట్‌కు రీ ట్వీట్‌లు చేస్తూ విజయాన్ని ఆస్వాదించారు. ప్రొఫైల్‌ పిక్స్‌ అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫొటోలతో నిండిపోయాయి. ఎన్నికల ఫలితాలపై సోషల్‌ మీడియాలో ప్రజల కోలహాలం హోరెత్తుతుంది. గ్రూపులు, పేజీలు, యూ ట్యూబ్‌, టిక్‌టాక్‌లలో టీఆర్‌ఎస్‌ విజయంపై విభిన్న రకాల నినాదాలతో వీడియోలు నెటజన్లను అలరించాయి. 

logo