గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 24, 2020 , 02:01:29

క్రమబద్ధీకరణ ఇక ఇంటి నుంచే..

క్రమబద్ధీకరణ ఇక  ఇంటి నుంచే..
  • - వచ్చే నెల 21వ తేదీతో ముగియనున్న ‘వీడీఎస్‌' గడువు
  • - ఆన్‌లైన్‌, స్థానిక డివిజన్లతో పాటు ఇండ్ల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • - ఇప్పటి వరకు 4వేల మంది దరఖాస్తు
  • - ఇంటింటి సర్వేను మరింత విస్తృతం చేయాలని నిర్ణయం

అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఇక ఇంటి వద్దనే స్వీకరించనున్నారు. వచ్చే నెల 21తో 90 రోజుల గడువు ముగుస్తుండటంతో వీడీఎస్‌ (వలంటరీ డిస్‌క్లోజ్‌ స్కీం)ను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటు స్థానిక డివిజన్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా 3400, కార్యా లయాల్లో 600 కలిపి మొత్తం 4వేల దరఖాస్తులను స్వీకరించారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు మీటర్‌ రీడర్లు అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఇక నుంచి ఇంటి వద్దనే స్వీకరించునున్నారు. వచ్చేనెల 21వ తేదీతో 90 రోజుల గడువు సమీపిస్తుండడంతో వీడీఎస్‌ (వాలంటరీ డిస్‌క్లోజ్‌ స్కీం) 2019 పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌తో పాటు స్థానిక డివిజన్‌ కార్యాలయాలలో వీడీఎస్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా 3400,నేరుగా వచ్చి దరఖాస్తులు స్వీకరించినవి 600 కలిపి మొత్తం 4వేల దరఖాస్తులను స్వీకరించారు. ఇంటింటి సర్వే జరుపుతున్న సిబ్బందితో పాటు మీటర్‌ రీడర్లకు అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు నగర వ్యాప్తంగా ఉన్న హోర్డింగ్‌లు, ప్రసార మాధ్యమాలు/రేడియా ద్వారా ఈ పథకంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా అక్రమ నల్లాలు దరఖాస్తులు చేసుకోకుండా ఉండి ఆ తర్వాత అధికారుల పరిశీలన అక్రమ నల్లా ఉన్నట్లు తేలితే సంబంధిత యాజమానులపై జైలుకు పంపించడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

 అక్రమ నల్లా, సివరేజీ కనెక్షన్లను గుర్తించడం, సంస్థ లోపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భారీగా అక్రమ నల్లాలను గుర్తించడంతో పాటు గృహ అవసరాలకు కనెక్షన్‌ తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నల్లాలను గుర్తిస్తున్నారు. కమర్షియల్‌ కేటగిరిలో 5290 నల్లాలు ఉన్నట్లు తేల్చారు.అక్రమంగా సివరేజీకనెక్షన్లు 2855 వరకు ఉన్నట్లు తేల్చారు.1595 నల్లాలు అక్రమంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది.వీటన్నింటి నుంచి కనెక్షన్‌ ఛార్జీల రూపంలో రూ.11.83కోట్ల మేర ఆదాయం వస్తే, నెలవారీగా నీటి బిల్లుల రూపంలో రూ. 37.35 లక్షలు ఆదాయం రానుందని అధికారులు పేర్కొన్నారు.


logo
>>>>>>