శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 24, 2020 , 02:01:29

‘ఆన్‌లైన్‌'లో ఫ్యాన్సీ నంబర్లు

‘ఆన్‌లైన్‌'లో  ఫ్యాన్సీ నంబర్లు
  • - ఆర్టీవోతో సంబంధం లేకుండా బిడ్డింగ్‌సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు గొడవ త్వరలో సద్దుమనుగనుంది.  ఆన్‌లైన్‌  బిడ్డింగ్‌ అమల్లోకి వచ్చాక ఆర్‌టీవోలకు  సంబంధం లేకుండా కంప్యూటరే అర్హత గల వాహనాలకు కేటాయించనుంది. నిత్యం వివాదాలతో కొనసాగుతున్న ఫ్యాన్సీ నెంబర్ల ప్రహసనం ఫిబ్రవరి నెల నుండి ఆన్‌లైన్‌లోకి వెళ్ళనుంది. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులు, సిబ్బంది కలిసి అనుకూలమైన వ్యక్తులకు ఫ్యాన్సీ నెంబర్లు కేటాయిస్తున్నారనే విమర్శలకు చెక్‌పెట్టి  నెంబర్ల కేటాయింపుల్లో పారదర్శకత ఉందని చెప్పడానికి ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. జనవరి నెల చివరి వారంలో అందుబాటులోకి తెస్తామని భావించినప్పటికీ రోడ్‌ సేఫ్టీ వీక్‌ ఈ నెల 27 నుండి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్నందున దీని అనంతరం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ఈ విషయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ట్రయల్న్‌,్ర టెస్టింగ్‌ ప్రక్రియ జరుగుతున్నది, డిజైన్‌, ప్రొసీడింగ్స్‌ వంటి విషయాలు అతి త్వరలో మంత్రి ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబరు పొందే తీరు ఇలా

ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబరు కేటాయింపుకు భిన్నంగా కొత్త విధానం ఉండనుంది. తెలంగాణ ట్రాన్స్‌పోర్టు వెబ్‌సైట్‌కు వెళ్ళి ఆన్‌లైన్‌ ఆప్షన్‌లోకి వెళ్ళి  స్టేటస్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్ల్‌పై క్లిక్‌చేసి వాహనదారుడు నివాస పరిధిలోకి వచ్చే ఆర్‌టీవో కార్యాలయంపై క్లిక్‌ చేస్తే ఆయా కార్యాలయం పరిధిలో ఉండే నంబర్లు కనబడుతాయి. ఆసక్తి గల నంబరును ఎంపిక చేసుకుని నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపిక చేసుకున్న నంబరుకు ఒకే ఆఫ్లికేషన్‌ వస్తే ఆటోమేటిక్‌గా కోరుకున్న నెంబరును కంప్యూటర్‌ కేటాయిస్తుంది. నిర్ణీత సమయం ఒంటి గంటలోపు ఒకటికి మించిన అఫ్లికేషన్‌ వస్తే ఆన్‌లైన్‌లో బిడ్స్‌ వేయాల్సి వస్తుంది. ఎవరి బిడ్‌ మొత్తం ఎక్కువగా ఉంటుం దో వారి వాహనానికి నంబరు ఆటోమేటిక్‌గా కేటాయింపబడుతుంది. ఐతే బిడ్‌ను మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.  ఇందులో తక్కువ బిడ్‌ చేసిన వాహనానికి నంబరు దక్కదు. ఐతే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తక్కువ బిడ్‌ చేసిన వారి ఎకౌంట్‌కు ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా తిరిగి జమ అవుతుంది. దళారుల జోక్యం, అవినీతి లేకుండా ఉండటానికి దీనిని అమల్లోకి తెస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఫ్యాన్సీ నంబరు పొందే అవకాశం  ఉంది. ఐతే  ఈ ప్రక్రియలో ఒక్కరు బిడ్‌ చేసిన మొత్తం ఇతరులకు కనబడే అవకాశం ఉండదు.

logo