సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 22, 2020 , 03:38:05

4వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

4వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు 4వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ తెలిపారు. మంగళవారం నేరేడ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 17 మున్సిపాలిటీలు, 5 మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మొత్తం 22 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఎల్బీనగర్ డీసీపీ జోన్ మొత్తం 19 పోలీస్ స్టేషన్ పరిధిలో ఓట్లు జరుగుతున్నాయన్నారు.

మొత్తం 8.4లక్షల మంది ఓటర్లు

ఎన్నికలు జరుగుతున్న 470 వార్డుల్లో మొత్తం 8.4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటికే 7వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 463 వార్డుల్లో 1874 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
 

పోలింగ్ స్టేషన్ వివరాలు...

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం పోలింగ్ లొకేషన్స్ 428 ఉన్నాయి. అందులో సమస్యాత్మకమైన పోలింగ్ ప్రాంతాలు 92, సాధారణ పోలింగ్ ప్రాంతాలు 336 ఉన్నాయి. పోలింగ్ స్టేషన్స్ మొత్తం 1283, సమస్యాత్మకమైనవి 342, సాధారణంగా ఉన్నవి 941 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాలను మొత్తం 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

రౌడీషీటర్ల కదలికలపై నిఘా..

ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మొత్తం 4వేల మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో మొబైల్ రూట్స్-122, ైఫ్లెయింగ్ స్క్వాడ్స్-23, ్రైస్టెకింగ్ ఫోర్స్-24, స్పెషల్ ్రైస్టెకింగ్ ఫోర్స్-21, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్-23, చెక్ ద్వారా తనిఖీలను చేపట్టారు. 216 మంది రౌడీషీటర్లు, మత ఘర్షణలను సృష్టించే వారి కదలికలపై నిఘా పెట్టారు.

పోలీసు చర్యలు ఇలా...

81 కేసుల్లో 292 మంది బైండోవర్, 380 తుపాకులను డిపాజిట్ చేసుకున్నారు. 61 మందికి తుపాకులను డిపాజిట్ నుంచి మినాహాయింపును ఇచ్చారు. 843 లీటర్ల మద్యం స్వాధీనం, 80వేల నగదు సీజ్, 52కేజీల గుట్కా స్వాధీనం, నాలుగు వాహనాలు జప్తు చేశారు.

అనుమానితులను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

ఎన్నికల్లో పోలీసు సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించేందుకు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి వివరించారు. ప్రతి మున్సిపాలిటీకి ఏసీపీ, అదనపు డీసీపీ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని సీపీ మహేశ్ వివరించారు. క్యూఆర్ రెస్పాండ్ టీమ్స్)తోపాటు ఇతర ప్రత్యేక బృందాలను అందుబాటులో పెట్టామన్నారు. సీసీ కెమెరాలు, మౌంటెడ్ మొబైల్ కెమెరాల ద్వారా అనుమానితుల గుర్తింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ
పేర్కొన్నారు.


logo