శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 22, 2020 , 03:36:13

తుది దశలో పనులు

 తుది దశలో పనులు

బాటసింగారంలో..నిల్వచేద్దాం..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఔటర్ రింగు రోడ్డు తీరంలో మరో లాజిస్టిక్ పార్కు అందుబాటులోకి రానున్నది. వస్తువుల రవాణాకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్  చుట్టూ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను  ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరులకు దిగుమతి చేసుకునేందుకు బాట సింగారం, మంగళ్ రెండు చోట్ల లాజిస్టిక్ పార్కు పనులను చేపట్టింది. నాగార్జున సాగర్ హైవే, విజయవాడ హైవేలో రెండు లాజిస్టిక్ పార్కు పనులకు 2017 అక్టోబరులో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగానే పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ (పీపీపీ) పద్ధతిలో  రూ.20కోట్లతో 22 ఎకరాలలో చేపట్టిన మంగళ్ లాజిస్టిక్ పార్కును గతేడాది అక్టోబరు 11న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అధునిక హంగులతో సిద్ధమైన ఈ పార్కు నుంచి సరుకుల రవాణ, ఎగుమతులు, దిగుమతుల వంటి కార్యకలాపాల సేవలను అందిస్తున్నది.

బాటసింగారంలో రూ.35కోట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో పనులు తుది దశకు చేర్చారు. వచ్చే నెలలో ఈ పార్కును అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా విశాలమైన గోదాం (వేర్ ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ఎండకాలంలో కూడా వేడిమిని తట్టుకుని చల్లదనాన్ని ఇచ్చేలా ఇన్స్ ఏర్పాటు చేశారు. లక్షల టన్నుల సరుకులు ఇక్కడ నిల్వ ఉండేలా భారీ గోడౌన్ నిర్మాణం పూర్తి చేశారు. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు విశాలమైన గదులను నిర్మించారు. డ్రైవర్లు పడుకునేందుకు బెడ్ కూడా ఏర్పాటు చేశారు. డ్రైవర్లుకు మౌలిక వసతుల్లో భాగంగా టాయిలెట్లు, బాత్ నిర్మించారు. తమ సామాన్లను భద్రపరచుకోవడానికి ప్రత్యేకంగా లాకర్ల సౌకర్యాన్ని కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీల డ్రైవర్లు సేద తీరేందుకు విశ్రాంతి భవనంలో సకల సౌకర్యాలను కల్పించారు. 500 ట్రక్కులు పార్కింగ్ చేసే సామర్ధ్యంతో పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు.

బాట సింగారం లాజిస్టిక్ పార్కు నిర్మాణ పనులివే

ఔటర్ రింగు రోడ్డుకు సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో బాట సింగారం లాజిస్టిక్ పార్కు సకల సదుపాయాలతో అందుబాటులోకి రానున్నది.. రవాణ సేవలకు వీలుగా 500 ట్రక్ నిలిపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. రెండు లక్షల చదరపు అడుగులు, 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్, కార్యాలయ నిర్వహణకు 10వేల చదరపు అడుగులు, ఒకటి వెహికల్ టెస్టింగ్ సెంటర్, 200 మందికి వీలుగా విశాంత్రి గదుల నిర్మాణం చేపట్టారు. ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్స్/దాబాలు, ఒక షేల్ కంపెనీకి చెందిన పెట్రోల్ బంకు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
logo