ఆదివారం 29 మార్చి 2020
Rangareddy - Jan 22, 2020 , 03:32:49

అర్ధరాత్రి కాంగ్రెస్ ప్రలోభం!

అర్ధరాత్రి కాంగ్రెస్ ప్రలోభం!


పెద్దఅంబర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ మున్సిపల్ ఎన్నికల నిబంధనలను ఉల్లఘించారు. పెద్దఅం బర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయికుటీర్  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ మాజీ ఎమ్మెల్యే మల్ రంగారెడ్డి, కాంగ్రెస్ 9వ వార్డు అభ్యర్థి చల్లూరి మురళీధర్ వెళ్లారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ముందు గా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ తన  అనుచరులతో  కలిసి కాలనీలో డబ్బు,మద్యం పంచుతున్నారనే సమాచారంతో సాయికుటీర్ కమ్యూనిటీ కాలనీ ఎదుట  బీజేపీ అభ్యర్థ్ధి తన అనుచరులతో కలిసి బైఠాయించారు.   ఎంపీ వాహనాలు బయటి కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈలోగా విషయం తెలుసుకున్న టీఆర్ అభ్యర్థి కంచర్ల సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. కోమటిరెడ్డి తన అనుచరులతో తన బంధువుల ఇంట్లో ఉండిపొయారు. ఆ ఇంట్లో కూడా నుంచి ఎంపీని బయటికి రాకుం డా కొంత సేపు అడ్డుకున్నారు.
     
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎన్నికల ఫ్ల్లయింగ్ స్కాడ్ నర్సింహారెడ్డికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ నర్సింహారెడ్డి ఎంపీ అనుమతులతో ఆయనకు సం బంధించి రెండు వాహనాలను పూర్తిగా సోదాలు చేయగా ఎటువంటి మద్యం, డబ్బులు దొరకలేదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.వనస్థలిపురం ఏసీబీ జయరాం, హయత్ నగర్ సీఐ సతీష్ సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలా ఉంటే  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ మాట్లాడుతూ తాను నల్గొండ నుంచి తమ బంధువులను కలిసేందుకు సాయి కుటీర్ వచ్చానని, కావాలనే బీజేపీ నాయకులు, అభ్యర్థి అనుచరులు తనను గంటన్నర సేపు కాలనీలో ఉంచి ఇబ్బందులు పెట్టారని వివరణ ఇచ్చారు. బీజేపీ అనుచరులు మద్యం తాగి తన వాహనాన్ని అడ్డుకున్నారని పొలీసులకు వివరించారు.
logo