సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 22, 2020 , 03:30:44

పర్యాటకుల స్వర్గధామమే !

పర్యాటకుల స్వర్గధామమే !


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కేరళకు దేశీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిం దని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో 16 శాతం వృద్ధిరేటు నమోదైందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ ఏర్పాటు చేసిన కేరళ టూరిజం పార్ట్ మీట్ 2020 కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సతృప దత్, కేరళ పర్యాటకశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీధరన్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు కూడా పెరి గారని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు ఎదుర్కొని కేరళ పర్యాటకం నిలబడిందన్నారు. తెలంగాణ ప్రాంతము నుండి కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించే ఎన్నో అందాలు కేరళ స్వంతమని అన్నారు. అందుకే కేరళను పర్యాటకుల స్వర్గధామని పిలుస్తారని అన్నారు.

దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విషయంలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. రెండవ విడత క్యాంపేయిన్ భాగంగా పది భారతీయ నగరాల్లో భాగస్వామ్య సమా వేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.భారత దేశమంతటా ముఖ్యమైన నగరాల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగబోతున్నట్లు చెప్పారు. మొదటగా హైదరాబాద్ నిర్వహి స్తున్నట్లు చెప్పారు. జనవరి 23న విశాఖపట్నం, జనవరి 28న కలకత్తాలో, జనవరి 30న గౌహతిలో, ఫిబ్రవరి11న అమృత్ ఫిబ్రవరి 13న చండీగఢ్, ఫిబ్రవరి 18న ఢిల్లీ, ఫిబ్రవరి 20న జైపూర్, మార్చి3న బెంగళూరు, మార్చి 5న చెన్నైలో సదస్సులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో పండుగలు, సంప్రదాయబద్ధంగా అద్భుతమైన అంశాలుంటాయని అన్నారు. నిషగంధి పండుగను అద్భుతంగా నిర్వహిస్తామని అన్నారు.

ఇందులో మాయా ప్రదర్శనలతోపాటు ఒడిస్సీ, కథక్, భరతనాట్యం, మణిపురి, మోహినిఅట్టం, చౌ, కూచి పూడి నృత్య రూపాలను పండుగలో ప్రదర్శిస్తారని అన్నారు. అదేవిధంగా క్రీస్తుపూర్వం మొదటి శతాబ్ధం నాటికి అరబ్బులు, రోమన్లు, ఈజిప్షియన్లు అభివృద్ధి చెందుతున్న ఓడ రేవు అవశేషాలు 25 మ్యూజియాలలో భద్రపరచబడ్డాయని అన్నారు.ఫిబ్రవరి త్రిసూర్ 21 ఏనుగులతో పెద్ద ర్యాలీతోపాటు పంచవద్యం, పండిమొలం వంటి సాంప్రదాయ సంగీత బృందాలు అలరిస్తాయని అన్నారు. మే నెలలో జరిగే కేరళ యొక్క ఆధ్యాత్మిక , సాంస్కృతిక సారాన్ని విలీనం చేసే అద్భుతమైన దృశ్యం త్రిస్సూర్ పూరం,కాపరిసన్ ఏనుగులు మిరుమిట్లు గొలిపే పారాసోల్స్, పెర్కషన్ మ్యూజిక్ గొప్ప ప్రదర్శన ఉంటుందని అన్నారు. చెలా,కురుంకుజల్,కొంబు, ఎలాథాలం వంటి సాంప్రదాయ వాయిద్యాలతో 250 మంది కళాకారులు  పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కేరళ సం ప్రదాయ నృత్యాలను, యుద్ధ ప్రదర్శనలు ఇచ్చారు.


logo