శనివారం 28 మార్చి 2020
Rangareddy - Jan 17, 2020 , 00:43:37

అర్హులందరికీ ‘డబుల్’ ఇండ్లు ఇస్తాం

అర్హులందరికీ ‘డబుల్’ ఇండ్లు ఇస్తాం

ఘట్ : అర్హులైన పేదలకు పట్టా సర్టిఫికెట్లు అందజేయడంతోపాటు డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్ పోచారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి మల్లారెడ్డితోపాటు మున్సిపల్ ఎన్నికల ఇన్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లితోపాటు మందాడి సురేందర్ కాలనీ, లక్ష్మీనర్సింహ కాలనీ, రాజీవ్ గృహకల్ప కాలనీ, ఘట్ మైసమ్మగుట్ట కాలనీ, వీకర్ సెక్షన్ కాలనీ, బాలాజీనగర్, గాంధీనగర్ వార్డుల్లో మంత్రి విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. మరోవైపు టీఆర్ అభ్యర్థుల గెలుపు కోరుతూ టీఆర్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ ఎన్ ప్రచారం నిర్వహించారు. పోచారం మున్సిపల్ నారపల్లిలో జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ఆరేండ్ల టీఆర్ పాలనలో సీఎం కేసీఆర్ హయాంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, రైతులకు రైతుబంధు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేయడానికి టీఆర్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ఇన్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ నగరంతోపాటు శివారు ప్రాంతాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మున్సిపాలిటీల్లో టీఆర్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ పుటం పురుషోత్తంరావు, ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం కౌన్సిలర్ బి.కొండల్ ఎంపీపీ వై.సుదర్శన్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ నాయకులు మందాడి సురేందర్ ఎస్.రాంరెడ్డి, పార్టీ అభ్యర్థులు బాలగోని వెంకటేశ్ మెట్టు బాల్ బండారి ఆంజనేయులు గౌడ్, ముల్లిపావని జంగయ్య యాదవ్, పల్లె మాధవి, బాలమ్మ, రామారావు ధనలక్ష్మి, మోత్కుపల్లి పోచమ్మ తదితరుల తరపున నాయకులు ప్రచారం చేశారు.


logo