గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 15, 2020 , 03:22:17

నిజాంపేట అభివృద్ధి బావుటా

నిజాంపేట  అభివృద్ధి బావుటా

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నిజాంపేట.. మొన్నటి వరకు నగర శివారులోని ఓ మారుమూల పల్లె.  నేడు నగరంలో సామానంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌.  అయితే ఆ  పరిధిలోని వీధుల్లో ఎల్‌ఈడీ కాంతుల ధగధగలు, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు,ప్రతి కాలనీలో ఓ పా ర్కు.. ఆ పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లు. రూ. వందల కోట్లతో నిర్మితమైతున్న డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు చిరునామాగా మారి అభివృద్ధి బావుటా ఎగరేస్తున్న నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌పై నమస్తే కథనం.. 


1976లో ప్రత్యేక పంచాయతీగా..

 కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న నింజాంపేట 1976కు ముందు మల్లంపేట గ్రామ పంచాయతీలో భాగంగా ఉండేది. 1976 తరువాత ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడి ప్రస్తుతం ప్రగతి నగర్‌తో కలిసి 2019లో మున్సిపాలిటీగా, తరువాత కొద్ది రోజులకే బాచుపల్లితో కలుపుకొని మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. ప్రస్తుతం సుమారు 55 వేల నివాసాలతో, 4 లక్షల జనాభాతో, సుమారు 100 కాలనీలతో తన పరిధిని విస్తరించుకుంటు అభివృద్ధిలో నగరంతో పోటీ పడుతుంది. 


విస్తరిస్తున్న కాలనీలు 

మేడ్చల్‌ జిల్లాలో భాగంగా ఉన్న నిజాంపేట నగర శివారు ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా చెప్పవచ్చును. దీంతో ఆ కార్పొరేషన్‌ పరిధిలో రోజురోజుకూ కాలనీలు విస్తరిస్తున్నాయి. హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, మియాపూర్‌ వంటి ప్రాంతాలకు అత్యంత చేరువులో ఉండటంతో ఈ ప్రాంతంలో రియర్‌ వ్యాపారం జోరుగా సాగుతుంది. అలాగే అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన ప్రజలు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. గత దశాబ్దం కిందట కేవలం 50వేల వరకు జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 3.50-4లక్షల వర కు జనాభా ఉంది. ఈ జనాభాకు సరిపడేలా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. దీంతో నిజాంపేట మున్సిపాలిటీలో ప్రజల సమస్యలు క్రమంగా తీరుతున్నాయి.


జోరుగా అభివృద్ధి...

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం అభివృద్ధి జోరుగా సాగుతుంది. ముఖ్యంగా కమ్యూనిటీ అవసరాలతో పాటు ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రభుత్వం రూ.50-100 కోట్ల వరకు వెచ్చించి 30 ఓపెన్‌ జిమ్‌లను, పార్కులను అభివృద్ధి చేస్తుంది. అలాగే రూ.4 వందల కోట్ల వరకు వెచ్చించి వేల సంఖ్యలో డబుల్‌బెడ్‌ ఇండ్లను నిర్మిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలతో పెట్టుపడులు పెట్టేందుకు, విద్యాసంస్థలను నెలకోల్పోందుకు పెట్టుబడిదారులు, విద్యావేత్తలు ముందుకు వస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విశ్వ విద్యాలయాలను తలపించేలా విద్యాసంస్థలు ఏర్పాటవుతుండటంతో ప్రస్తుతం ఈ ప్రాంతం ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారింది.  


logo
>>>>>>