బుధవారం 01 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 13, 2020 , 03:36:49

ప్రతి పల్లెలో ‘ప్రగతి’

ప్రతి పల్లెలో ‘ప్రగతి’

గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి పల్లె ప్రగతి రెండో విడుత విజయవంతమైంది. జనవరి 2న పారంభమైన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. 560 గ్రామపంచాయతీల్లో పది రోజులపాటు ధొపనులు ముమ్మరంగా జరిగాయి.

  • ముగిసిన రెండో విడుత పల్లెప్రగతి
  • జిల్లాలోని 560 గ్రామపంచాయతీల్లో అమలు
  • పది రోజులపాటు జరిగిన అభివృద్ధి పనులు
  • పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్న పల్లెలు
  • పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రత్యేకాధికారులు

గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి   పల్లె ప్రగతి రెండో విడుత  విజయవంతమైంది. జనవరి 2న పారంభమైన  కార్యక్రమం ఆదివారంతో ముగిసింది.  560 గ్రామపంచాయతీల్లో పది రోజులపాటు ధొపనులు ముమ్మరంగా జరిగాయి. 


అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామీణ ప్రజలు భాగస్వాములై శ్రమదానం, హరితహారం, పారిశుద్ధ్య పనులు చేపట్టారు.  వీధుల వెంట పిచ్చిమొక్కలు, కంపచెట్లను తొలగించారు. అస్తవ్యస్తంగా మారిన మురుగు  శుభ్రం చేశారు.  మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో పాడుబడిన బావులను జేసీబీలతో పూడ్చివేశారు. పాత ఇండ్లను కూల్చివేశారు.  యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టారు. దీంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో  రూపును సంతరించుకున్నాయి.


షాబాద్‌, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువచ్చిన రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైనది. జనవరి 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం 12వ తేదీ వరకు సాగింది. సెలవులతో సంబంధం లేకుండా గ్రామాల్లో హరితహారం, శ్రమదానం, డంపింగ్‌యార్డు, శ్మశనవాటికల నిర్మాణం, సమస్యల గుర్తింపు, పరిష్కారం వంటి పనులు చకచకా జరిగాయి. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో 10 రోజుల పాటు వివిధ పనులు చేపట్టారు. పిచ్చిమొక్కలు, అస్తవ్యస్తంగా మారిన మురికికాల్వలు, పాడుబడిన ఇండ్లు, బావులు, బురద రోడ్లతో ఉండే గ్రామాలు రెండో విడత ప్రణాళికలో చేపట్టిన పనులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటడంతో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టడంతో గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొన్నది. స్థానికులు శ్రమదానంతో వివిధ పనులు చేపట్టగా, గ్రామాల అభివృద్ధికి దాతలు తమవంతు సహకారం అందించారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 


జిల్లాలో 560 గ్రామ పంచాయతీల్లో పనులు

జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 560 గ్రామ పంచాయతీల్లో 10 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా ముగిసింది. జిల్లాలో ఈ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికుల సహకారంతో గ్రామాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, 10 రోజుల ప్రత్యేక కార్యచరణలో మేము సైతం అంటూ స్థానికులు ముందుకు వచ్చి అభివృద్ధి పనుల్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ గ్రామాలను తాము అభివృద్ధి చేసుకుంటామని, ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను అమలయ్యేలా చూస్తామని ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు చెబుతున్నారు. శ్రమదానంతో పలు పనులను చేపట్టారు. 


ఎప్పటికపుడూ అధికారుల పర్యవేక్షణ...

ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులు రోజు వారి కార్యక్రమాలను పర్యవేక్షించగా గ్రామాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు ఈ కార్యక్రమంలో తమకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులతో కలిసి గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, పెంట కుప్పలను తొలగించడం, శిథిలావస్థలతో ఉన్న ఇండ్లను కూల్చివేయడం, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, గ్రామస్తులతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం లక్ష్యం ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేశారు. గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగం, మొక్కల పెంపకంతో కలిగే ప్రయోజనాలను అధికారులకు ప్రజలకు వివరించారు. పవర్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. 


పరిశుభ్రతపై అవగాహన..

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో పచ్చదనం, పరిశుభ్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు ఎంతో కృషి చేశారు. దీంతో గ్రామాల్లో ప్రజలు తమ ఇండ్లలో పాటు వీధులను పరిశుభ్రంగా ఉంచేలా తమవంత సహకారాన్ని అందిస్తున్నారు. చెత్తాచెదారాన్ని వీధుల్లో, మురికి కాల్వల్లో పడేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిన బుట్టల్లో వేసి పంచాయతీ రిక్షాల ద్వారా డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. మురుగుకాల్వలు శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, స్థానికులు దాతల రూపంలో నగదుతో పాటు చెత్తబుట్టలు, ట్రీగార్డులు, స్థలాలు ఇవ్వడం జరిగింది. 


జిల్లాలో చేపట్టిన పనుల వివరాలు...
జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 560 గ్రామ పంచాయతీల్లో 
పది రోజుల ప్రణాళికలో పనుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి


క్ర.సం పనిపేరు    గుర్తించినవి పూర్తి చేసినవి శాతం

1 రోడ్లు శుభ్రం 9477,52 9409,85 99.3                                              

2.        మురుగుకాల్వలు 6214,75 6155,84 99.1                                                                              

3.      పాత ఇండ్లు 2632        2431 92.4                                                          

4.    పిచ్చిమొక్కలు      7625 7242 95.0                                                                                                                                              

5.    ఇతరత్రా స్థలాల్లో    6131 5699 93.0                        

పిచ్చిమొక్కలు                        

6 ఓపెన్‌ బావులు 421 278 66.0                                           

7.  వినియోగంలో లేని బోర్లు 175 155 88.6                                

8.  ఎత్తుపలాలనీటి గుంతలు  1506 1387 92.1                                                     

9.    బ్లీచింగ్‌ పౌడర్‌ వేయడం 4378 4053 92.6                                             

10.  రోడ్లపై గుంతలు 4720 4497 95.3                                  

11.  అంగన్‌వాడిల శుభ్రం 944 930 98.5                               

12.  ఫ్రైమరీ స్కూల్స్‌ 599 589 98.3                                    

13.  ప్రాథమికోన్నత పాఠశాలలు 158 155 98.1                                                   

14.  ఉన్నత పాఠశాలలు 162 161 99.4                                    

15.  దవఖానలు 183 176 96.2                      

16.  కమ్యూనిటీ భవనాలు 539 531 98.5                                 

17.  ఇతరత్రా భవనాలు 445 434 97.5                            

18.  వాగు ఇసుక మెటల్‌ 378 368 97.4                                  

19.  మార్కెట్‌ యార్డులు 104 99 95.2                         

20.  చెత్తబుట్టల పంపిణీ 23580 17048 72.3                                         

21.  వేలాడుతున్న విద్యుత్‌వైర్లు 2302 1270 55.2                                               

22.  బెంట్‌ కరెంట్‌ స్తంభాలు 1734 1032 59.5                                                   

23. నేలకొరిగిన కరెంట్‌ స్తంభాలు 945 594 62.9                                                  

24. స్థంభాలకు థర్డ్‌ వైర్లు 7242 3713 51.3                              

25. లైట్స్‌. పిక్చర్స్‌ 9144 5974 65.3                    

26. ఇండ్ల నుంచి చెత్త సేకరణ 2,20,362 1,86,973 84.8                                             

27.  మొత్తం వీధీలైట్లు 62,862 59,985 95.4                           


పంచాయతీ యాక్షన్‌ ప్లాన్‌ 484 408 80.1logo
>>>>>>