మంగళవారం 07 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 13, 2020 , 03:35:22

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలు

అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలు

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార అస్ర్తాలుగా మలుచుకుని ఘన విజయం సాధించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

  • రూ. 60వేల కోట్లతో అభివృద్ధి పథకాలు
  • అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌దే విజయం
  • 85శాతం విద్యావంతులు
  • కౌన్సిలర్లకు రూ. 50లక్షలు నిధులు అందజేత
  • ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి శూన్యం
  • బీఫాం ఇచ్చిన వారిని పార్టీ శ్రేణులు గెలిపించాలి
  • ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఆదిబట్ల: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార అస్ర్తాలుగా మలుచుకుని ఘన విజయం సాధించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలోని నాలుగు మున్సిపాలిటీల టీఆర్‌ఎస్‌ సమన్వయ సమావేశం ఆదిబట్ల మున్సిపాలిటీలోని బొంగుళూర్‌ సమీపంలో ఉన్న కల్లెం జంగారెడ్డి గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. నాలుగు మున్సిపాలిటీలకు చెందిన టీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ అభ్యర్థులు 77 మందికి ఎమ్మెల్యే బీఫాంలు అందజేశారు. వారితో ప్రమాణం చేయించారు. ముందస్తుగా అభ్యర్థులకు పార్టీ విప్‌ జారీచేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్‌1గా నిలిచిందన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.60 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 13 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకాను మోగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, డబుల్‌బెడ్‌ర్రూం ఇండ్లు, షాదీముబారక్‌, పింఛన్లు, రైతులకు పెట్టుబడి సాయం వంటి పథకాలు అందుతున్నాయన్నారు. ప్రతి పక్షపార్టీల వల్ల అభివృద్ధి ఏమాత్రం జరుగదని, కుంటుపడుతుందని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉందని, తాను ఇంకా నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఉంటామని, తాను మాత్రమే అభివృద్ధికి నిథులు కేటాయిస్తానని చెప్పారు. ఎంపీ అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతారని, ఆయనకు ఏడాదికి నియోజకవర్గం అభివృద్ధికి రూ.5 కోట్లు ఇస్తారని, ఇంకా అదనంగా నిధులు వచ్చే అవకాశం లేదని అన్నారు.


మున్సిపల్‌ ఎన్నికల్లో నియోజకర్గంలో 44మంది మహిళలకు టికెట్లు ఇచ్చామన్నారు. వీరిలో 85 శాతం విద్యావంతులు ఉన్నారన్నారు. 19 మంది ఎస్సీలకు, 4ఎస్టీలకు, 3మైనార్టీలకు, 32 మంది బీసీలకు, 29 మంది జనరల్‌ అభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ తరఫున మున్సిపల్‌ టికెట్లు ఇచ్చామన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లుగా గెలుపొందిన వారికి వార్డులను అభివృద్ధి చేసేందుకు, ప్రతి వార్డుకు రూ.50 లక్షలు కేటాయిస్తామన్నారు. పార్టీ తరఫున బీఫాంలు ఇచ్చిన అభ్యర్థులకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాని ఆయన కోరారు. పార్టీ బీఫాంలు రానివారు సోమవారం పోటీ నుంచి తప్పుకుని అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు రాంబాబు యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కృపేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి,  మున్సిపాలిటీల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు గోపగల్ల బాబులు, ఆకుల యాదగరి, బలదేవరెడ్డి, మాజీ జట్పీటీసీ పొట్టి ఐలయ్య, నాయకులు నోముల కృష్ణాగౌడ్‌, పల్లెగోపాల్‌గౌడ్‌, కోరే జంగయ్య, కల్వకోలు రవీందర్‌రెడ్డి, పైయిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌ పాల్గొన్నారు. 


ఆమనగల్లులో అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన ఎమ్మెల్యే 

ఆమనగల్లు, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ ఆమనగల్లు పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల్లో  వివిధ వార్డులకు బరిలో నిలిచిన  9మంది అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలిశ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ బీఫాంలు అందజేశారు. మున్సిపాలిటీలోని 15 వార్డులకు పార్టీ తరఫునా పలువురు ఆశావహులు నామినేషన్లను దాఖలుచేశారు. వార్డుల వారీగా  ఆశావహులు ప్రత్యేకంగా సమన్వయ కమిటీతో సమావేశమై, 9వార్డులకు అభ్యర్థులను ఖరారుచేశారు. పార్టీ నియమ, నిబంధనలు సామాజిక, ఆర్థిక పరిస్థితిలను అన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సూచనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 15 వార్డుల స్థానాలకు చెందిన అభ్యర్థుల్లో 9 మంది పార్టీ తరఫునా బీఫాంలు ఇచ్చారు. మిగాతా 6 స్థానాల కోసం పలువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది.


నేడు మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి బీఫాంలు అందజేస్తామని నాయకులు పేర్కొన్నారు.  బీఫాంలు అందుకొన్న వారిలో 1 వార్డుకు హేమ్లానాయక్‌, 2 వార్డుకు శ్రీధర్‌రెడ్డి, 4 వార్డుకు ఆంజనేయులు, 6 వార్డుకు ఉషారాణి, 7 వార్డుకు రామకృష్ణ, 9 వార్డుకు సోనీ, 10 వార్డుకు శాంతి, 12 వార్డుకు అనిత, 15 వార్డుకు ఎంగలి రఘు బీఫాంలు అందుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వస్పుల జంగయ్య, మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ, వైస్‌ఎంపీపీ అనంతరెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్‌ అర్జున్‌రావు, తోట గిరి, విజయ్‌, వెంకట్‌రెడ్డి, ఖలీల్‌ పాల్గొన్నారు.


logo