శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 13, 2020 , 03:33:07

ఆశీర్వదించండి.. అభివృద్ధికి బాటలు వేస్తా..

ఆశీర్వదించండి.. అభివృద్ధికి బాటలు వేస్తా..

ఓటర్లు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తామని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపటేల్‌గూడ 15వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాశం రవీందర్‌గౌడ్‌ అన్నారు.

  • ఎంపీపటేల్‌గూడ 15వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాశం రవీందర్‌గౌడ్‌

ఆదిబట్ల : ఓటర్లు తనను ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తామని ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీపటేల్‌గూడ 15వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాశం రవీందర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం 15వార్డులో రవీందర్‌గౌడ్‌ సతీమణి ఉదయశ్రీ, టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  ఉదయశ్రీ మహిళలకు బొట్టు పెట్టి తన భర్త రవీందర్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆపూర్వ స్పందన లభించింది. ఈ సం దర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాశం రవీందర్‌గౌడ్‌ మాట్లాడుతూ..ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు. నిస్వార్దంగా పని చేసి 15 వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, వారి అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో అధిక నిధులు మంజూరు చేయించి..15 వార్డు రూపురేఖలు మారుస్తామని ఆయన వివరించారు.

ఎంపీ పటేల్‌గూడలో అర్హులైనా నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామని, ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇండ్లు నిర్మించుకోవటానికి ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలను మంజూరు చేయిస్తామన్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పింఛన్లు అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చేయూత నిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందుకుంటున్న లబ్ధిదారులు మున్సిపల్‌ ఎన్నికల్లో తనకు 15వార్డులో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.  ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పేవారి మాటలను ప్రజలు నమ్మకూడదన్నారు. ఇతర పార్టీల నుంచి ఏ మాత్రం అభివృద్ధి చెందదని ఆయన వివరించారు. ఎన్నికల్లో తనను కౌన్సిలర్‌గా గెలిపిప్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా అభివృద్ధికి పనిచేస్తామన్నారు.  ప్రభుత్వం, ఎమ్మెల్యే అండదండలతో ఎంపీ పటేల్‌గూడ అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


logo