బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 13, 2020 , 03:32:28

కుమ్మరికుంట సమస్యకు శాశ్వత పరిష్కారం

కుమ్మరికుంట సమస్యకు శాశ్వత పరిష్కారం

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులోని కుమ్మరికుంట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, ఆ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్ల మంగ జగదీశ్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం కుమ్మరికుంట కాలనీలో ఇంటింటికి ప్రచారాన్ని ఆమె నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం, నమస్తేతెలంగాణ : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులోని కుమ్మరికుంట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని, ఆ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్ల మంగ జగదీశ్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం కుమ్మరికుంట కాలనీలో ఇంటింటికి ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. వర్షాకాలం వచ్చిందంటే కుమ్మరికుంట కాలనీవాసులు కంటిమీద కునుకులేకుండా ఉంటుందన్నారు. వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు వచ్చి ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కుమ్మరికుంట కాలనీకి వరదనీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. కుమ్మరికుంట కాలనీలో సొంత ఇళ్లులేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని వారందరికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి వార్డుకు వంద చొప్పున డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఆ ఇండ్లలో అత్యధికంగా కుమ్మరికుంట కాలనీకి చెందిన వారికే ఇస్తామన్నారు. కుమ్మరికుంట కాలనీలో ప్రతి ఇంటికి తాగునీరు  అందిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పార్టీ, ఇబ్రహీంపట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఉన్నందున మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను గెలిచిన వెంటనే కుమ్మరికుంట కాలనీలో దోమల సమస్య, మురుగు కాలువ సమస్యను యుద్దప్రాతిపాదికన పరిష్కరిస్తా. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పిస్తామన్నారు. 


ఉద్యమమే ఊపిరిగా..

ఇబ్రహీంపట్నం 21వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్ల మంగ జగదీశ్‌ ఉద్యమమే ఊపిరిగా ముందుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంగ భర్త జగదీశ్‌ ఉద్యమనేతగా ప్రజలకు సుపరిచితుడు. 2001లో టీఆర్‌ఎస్‌ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా ఎన్నికై ఏడు సంవత్సరాలు పార్టీ బలోపేతానికి పనిచేశారు. 2008లో జిల్లా టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2009లో తెలంగాణ జేఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం అఖిలభారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. అభ్యర్థి మంగ ఆయనతో పాటు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 


logo