గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:32:01

ఎన్నికల ఖర్చులపై నిఘా పెంచాలి: వీరభద్రయ్య

ఎన్నికల ఖర్చులపై నిఘా పెంచాలి: వీరభద్రయ్య


మణికొండ, నమస్తే తెలంగాణ: ఎన్నికల ఖర్చులపై నిఘా పెంచాలని  జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలనాధికారి వీరభద్రయ్య ఎన్నికల పరిశీలన అధికారులను ఆదేశించారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణ పనులను పరిశీలించారు. పరిశీలన అధికారులతో ఆయన సమావేశమైయ్యారు. పురపాలక ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఖర్చులపై ఎప్పుకప్పుడు నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు.  ద్విచక్ర వాహనాలు, కార్లు, అనుమానిత వ్యక్తులపై అప్రమత్తత పాటించాలన్నారు. ప్రచారాలకు కేటాయించిన సమయంలోపు ముగించేలా చూడాలన్నారు. నిబంధనలను పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


logo