బుధవారం 08 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:28:45

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫార్మా

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఫార్మా


పర్యావరణహితంగా, స్థానిక వనరులకు ఎలాంటి ఆటంకం లేకుండా ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ’ని నెలకొల్పుతోంది. జీడిమెట్ల, పాశమైలారం, పటాన్‌చెరు వంటి కాలుష్యకాసారాలుగా కాకుండా పక్కా ప్రణాళికను అమలు చేస్తోంది. భూగర్భ జలాల వినియోగం లేకుండానే ఫార్మా ఉత్పత్తులకు రంగం సిద్ధం చేసిం ది. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారానే నీళ్లందించేందుకు వ్యూహరచన చేసింది. తెలంగాణ ప్రభుత్వం పార్మాసిటీని ‘మేక్‌, లివ్‌, లెర్న్‌, ఇన్నోవేట్‌, ఎక్సెల్‌' మార్గం లో నెలకొల్పుతోంది. హైదరాబాద్‌ ఫార్మా నిమ్జ్‌ను పర్యావరణహితంగా రూపొందిస్తోంది. అక్కడే టౌన్‌షిప్పులకు కూడా ప్లాన్‌ చేసింది. ఫార్మా యూనివర్సిటీని నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ఎంతో మేలు కలిగించే ఫార్మా సిటీని రైతాంగం కూడా స్వాగతిస్తోంది. హైదరాబాద్‌ రానున్న రోజుల్లో ‘బల్క్‌ డ్రగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా రూపుదిద్దుకోనుంది. డ్రగ్‌ డిస్కవరీ అండ్‌ డెవలప్‌మెంట్‌, కెమిస్ట్రీ సర్వీసెస్‌, బయోలాజికల్‌ సర్వీసెస్‌ వంటి అంశాల్లో విద్యావంతులు దృష్టి సారిస్తే ఉద్యోగాలు పొందొచ్చు. 19,333ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిచనున్నారు. దీని వ్యయం: రూ.16,395 కోట్లు, 4.25 లక్షదికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  ముచ్చర్లలో ఫార్మా సిటీ ప్రాజెక్టు, మరోవైపు రీజిన ల్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనతో కందుకూరు, మహేశ్వరం, కడ్తాల, ఆమనగల్లు, యాచారం, ఇబ్రాహీంపట్నం, షాద్‌నగర్‌, కొత్తూరు, కొందుర్గు, నందిగామ, షాబాద్‌, చేవెళ్ల,  మండలాల్లో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం ఎకరాల్లో అమ్మే భూములు తాజాగా గజాల్లోనే విక్రయిస్తున్నారు.


logo