శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:27:14

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి:కలెక్టర్‌

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దండి:కలెక్టర్‌


మూడుచింతలపల్లి: మండలంలోని గ్రామాలన్నింటినీ ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. శనివారం మం డలంలోని ఉద్దెమర్రి, నాగిశెట్టిపల్లి గ్రామాలను కలెక్టర్‌ శనివారం సందర్శించారు. ఉదెమర్రి గ్రామంలో హరితహారం పని తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్‌, కార్యదర్శికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం నాగిశెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించి మొక్కలను పరిశీలించారు. మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని సర్పంచ్‌కు సూచించారు. నాగిశెట్టిపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి తన ఇంటి పక్కన పెంచుతున్న పెరటితోటను కలెక్టర్‌ పరిశీలించి ఆయనను కలెక్టర్‌ అభినందించారు.పంచాయతీ ఆవరణలో గ్రామస్తులతో చర్చించివారి సమస్యలను తెలుసుకున్నారు.గ్రామంలోని స్మృతివనా న్ని, వైకుంఠ ధామాన్ని, నర్సరీని సందర్శించారు. గ్రామ సర్పంచ్‌ కృపాకర్‌రెడ్డిని కలెక్టర్‌ అభినందించారు.కార్యక్రమంలో ఎంపీపీ హారిక, ఎంపీడీవో సువిధ, ఎంపీటీసీ హన్మంత్‌రెడ్డి, డీఆర్‌డీవో జ్యోతి, మండల ప్రత్యేక అధికారిదేవసహాయం,డీపీఆర్‌వోసరస్వతి ఉన్నారు.


logo