శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:25:36

రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించుకోవాలి

రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించుకోవాలి


బషీర్‌బాగ్‌: దేశ రాజ్యాంగాన్ని దేశ ప్రజలే రక్షించుకోవాల్సిన అసరమున్నదని కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషిశ్రీధర్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన భారత ప్రభుత్వం నేడు దాని ఆయువుపట్టయిన లౌకికత్వాన్ని హరిస్తున్నందున అన్ని వర్గాల ప్రజానీకం ముందుకురావాలన్నారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కే. గోవర్థన్‌,న్యూడెమోక్రసీ నాయకులు ఎస్‌కే. ముక్తార్‌ పాషా, జమాయితే ఇస్లామి హింద్‌ కార్యదర్శి సాధిక్‌ అహ్మద్‌, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి. సంధ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, ఖలీదా పర్విన్‌, సీడీఎస్‌ యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. పరుషరామ్‌, ఏఐకేఎంఎస్‌రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావులు ప్రసంగించారు. ఈ సం దర్భంగా ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లను ఎత్తివేయాలని సభలో తీర్మానం చేశారు.


logo