శనివారం 04 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:21:25

యువతి పట్ల అసభ్యప్రవర్తన

యువతి పట్ల అసభ్యప్రవర్తన


బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటోడ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడలో నివాసం ఉంటున్న యువతి(24)  బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తుంది. శనివారం ఇంటినుంచి ఇందిరానగర్‌ మీదుగా  బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 2లోని ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వెనకాలనుంచి ప్రధాన రహదారివైపు వెళుతుంది.  అదే సమయంలో ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్‌  నర్సింహ(22) ఆమెను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి చేయి పట్టుకుని లాగడంతో కేకలు వేసింది. దాంతో సమీపంలోని స్థానికులు వచ్చి నర్సింహను చితకబాదారు. అక్కడున్న చెట్టుకు కట్టేసి బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చా రు.  పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తీసుకువెళ్లారు.  ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


logo