గురువారం 02 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 12, 2020 , 01:13:47

రోహిత ఎక్కడ...?

రోహిత ఎక్కడ...?
  • -ఇంకా ఆచూకీ లభించని వైనం..
  • -5 బృందాలతో ముమ్మర గాలింపు
  • -ఆచూకీ తెలిపితే తగిన పారితోషికం : పోలీసులు

శేరిలింగంపల్లి : సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణి రోహిత కేసు మిస్టరీ ఇంకా వీడడం లేదు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత ఆచూకీ.. ఇంత వరకు దొరకలేదు. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  పోలీసులు.. 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపును ముమ్మురం చేశారు. మాదాపూర్‌ ఎస్‌ఓటీ ప్రత్యేకంగా రోహిత కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆమె నివాసం ఉంటున్న నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని మంత్రి సెలెస్టా అపార్టుమెంట్‌తో పాటు గచ్చిబౌలి పరిసర ప్రాంతాలైన విప్రో జంక్షన్‌, ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీల్లో ఆమె కదలికలు లభ్యమైనప్పటికీ.. ఆ తర్వాత ఎటువెళ్లిందనేది ఇంకా మిస్టరీగా మారిందన్నారు. రోహిత నగరంలోనే సంచరిస్తుందన్న కుటుంబసభ్యులు,  బంధువుల సమాచారం మేర కు ఆయా ప్రాంతాల్లో ముమ్మురంగా గాలిస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయిందని, సికింద్రాబాద్‌తో పాటు చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతా ల్లో రోహిత సంచరించినట్లు సమాచారం అందగా వాస్తవాలను పరిశీలించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలించినా లా భం లేదన్నారు. కాగా.. రోహిత ఆదృశ్యానికి ముందు డిసెంబర్‌ 23న గచ్చిబౌలిలోని తన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.80 వేలు   విత్‌డ్రా చేసింద ని, ఆమె వదిలివెళ్లిన సెల్‌ఫోన్‌ లభ్యమైనప్పటికీ అందులో ఎలాంటి సమాచారం, ఆధారాలు లభించలేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రోహిత అచూకీ తెలిపిన వారు సైబరాబాద్‌ కంట్రోల్‌ రూం 9490617100, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ 9491030378, 7901118015, 7901157084, గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్‌  నంబర్‌ 9490617127లను సంప్రదించాలని, రోహిత అచూకీ తెలిపిన వారికి సైబరాబాద్‌ పోలీసులు తగిన పారితోషికం  ఇస్తామని పోలీసులు తెలిపారు.


logo