మంగళవారం 31 మార్చి 2020
Rangareddy - Jan 10, 2020 , 10:55:20

అపోహలు వీడండి...ప్రాణాలు కాపాడండి

అపోహలు వీడండి...ప్రాణాలు కాపాడండి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సహా యం చేయండి..పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వైద్యులు, నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేస్తే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాలనే అపోహతో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, దీంతో చాలా మంది మరణిస్తున్నారని అన్నా రు. పోలీసుల నుంచి ఎలాంటి వత్తిల్లు ఉండవని సీపీ స్పష్టం చేశా రు. పోలీసులు, వైద్యులు సమన్వయంతో పని చేయాలని సీపీ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాయపడ్డ వారిని దవాఖానాల్లో చేర్చుకోవడానికి నిరాకరించవద్దన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ ఎం. వెంకటేశ్వరరావు, శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, బాలానగర్ డీసీపీ పద్మజ, అదనపు డీసీపీలు, ఏసీపీలు,ఇన్‌స్పెక్టర్‌లు, వైద్యులు పాల్గొన్నారు.

రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండాలి:సీసీ మహేశ్‌భగవత్
గోల్నాక: రహదారుల భద్రతతో పాటు మహిళల భద్రతపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నా రు. గురువారం అంబర్‌పేట కార్ క్వార్టర్స్‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెట్రోలింగ్, బ్లూకోట్స్‌లో విధులు నిర్వహించే పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మా నికి ఆయన హాజ రై మాట్లాడారు... నేరాలు జరిగే ఆస్కా రం ఉన్న ప్రాంతాల్లో ముమ్మరం గా గస్తీ నిర్వహించా లన్నారు. ఇందుకు సంబంధించి జీవన్ హెల్త్ కేర్ సంస్థ ప్రతినిధులు లక్ష్మణ్, రమేశ్‌కుమార్ రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ప్రథమ చికిత్సపై పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాచకొండ పోలీసులు పాల్గొన్నారు.


logo
>>>>>>