మంగళవారం 27 అక్టోబర్ 2020
Rangareddy - Aug 28, 2020 , 00:24:33

అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 

ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నాగోల్‌ డివిజన్‌లోని సర్వేనంబర్‌ 58లో రూ.1.67కోట్లతో సీసీ రోడ్డు పనులకు, లక్ష్మీనర్సింహాకాలనీలో రూ.94లక్షలతో నిర్మించే సీసీరోడ్డు పనులకు నాగోలు కార్పొరేటర్‌ చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు అనంతుల రాజారెడ్డి, చిరంజీవి, కృష్ణ, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి..

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ వింగ్‌ రాష్ట్ర నాయకుడు శివప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్‌ శానిటైజర్‌ మెషీన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మెషీన్‌ను ఏర్పాటు చేసిన శివప్రకాశ్‌ను అభినందించారు. కార్పొరేటర్లు జీవీ సాగర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, నాయకులు రవి యాదవ్‌, శ్యామల, ప్రవీణ్‌గౌడ్‌, మణిగౌడ్‌, మహేందర్‌రెడ్డి, కందికంటి మహేందర్‌ పాల్గొన్నారు. 

ముంపు ప్రాంతాల సమస్యలు పరిష్కరిస్తాం..

నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్‌లో ముంపు ప్రాంతాలను కార్పొరేటర్‌ రమావత్‌ పద్మానాయక్‌, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, జలమండలి జీఎం అమరేందర్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఎల్బీనగర్‌ ఉప కమిషనర్‌ విజయకృష్ణ, ప్రాజెక్ట్‌ వింగ్‌ అధికారులు, కాలనీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్నారు. 

డ్రైనేజీల ఆధునీకరణకు కృషిచేస్తాం..

వనస్థలిపురం: డ్రైనేజీలను ఆధునీకరించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం హస్తినాపురం డివిజన్‌ సాగర్‌ఎన్‌క్లేవ్‌కాలనీలో కార్పొరేటర్‌ పద్మ, అధికారులతో కలిసి పర్యటించారు. డీసీ విజయకృష్ణ, ప్రా జెక్టు జీఎం అమరేందర్‌రెడ్డి,   సం ఘాల నే తలు పాల్గొన్నారు.


logo