e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home రంగారెడ్డి స్వచ్ఛంగా..పచ్చగా

స్వచ్ఛంగా..పచ్చగా

కులకచర్ల, జూలై 27: అభివృద్ధిలో లింగంపల్లి గ్రామ పంచాయతీ ముం దుంది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్క రిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన చౌడాపూర్‌ మం డలానికి చెందిన లింగంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్‌ శార దమ్మ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు చేపడు తున్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి గ్రామ పంచాయతీలో 560 జనాభా ఉంది. నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నా రు. అనుబంధ గ్రామం దాడి తండా. కులకచర్ల మండల కేంద్రంలో ఉన్న లింగంపల్లి గ్రామ పంచాయతీలో వివిధ సమస్యలతో ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు భారీగా నిధులను కేటాయించడంతో రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలతో గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో చూపరులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.

పల్లె ప్రగతిలో గ్రామ పంచా యతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, వాటర్‌ ట్యాంకర్‌ సమకూర్చుకున్నారు. రూ. 12.5 లక్షలతో శ్మశానవాటిక నిర్మాణ పనులు పూర్తిచేశారు. అలాగే 2.20 లక్షలతో నిర్మించిన కంపోస్ట్‌ షెడ్‌ ఉపయోగంలోకి వచ్చింది. మొత్తంగా గ్రా మంలో రూ. 35 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. వీధిదీపాల ఏర్పాటు, ఇంటింటికి నల్లా నీరు సరఫరా పనులు పూర్తయ్యాయి. గ్రామంలో ప్రతి రోజు ట్రాక్టర్‌ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డు లకు తరలిస్తున్నారు. దీనికి గాను ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను గ్రామ పంచాయతీ ద్వారా అందజేశారు. మురుగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మురుగునీటి కాల్వలను శుభ్రం చేయడంతో దోమలు ప్రబ లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -

ఆదర్శంగా తీర్చిదిద్దుతా
లింగంపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే పల్లె ప్రగతిలో నిర్వహించాల్సిన వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశాం. గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిదంగా చూస్తున్నాం. గ్రామస్తుల సహకారంతో గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.
-శాదరమ్మ, సర్పంచ్‌

పనులు పూర్తి చేశాం
పల్లె ప్రగతి ద్వారా నిర్వహించాల్సిన పనులు పూర్తి చేశాం. శ్మశానవాటిక నిర్మా ణం పూర్తి చేశాం. పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశాం. డంపింగ్‌ యా ర్డును ఏర్పాటు చేసి ప్రతి రోజు చెత్తను సేకరిం చి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నాం. వీధి దీపాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • బిచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి
  • సంతోషంగా ఉంది..
    గతంలో గ్రామాల్లో వివిధ రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులుపడేవారు. పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి ప ను లు చేపడుతుండడంతో సంతోషంగా ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేయడం హర్షణీయం. లింగంపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
    -నర్సింహ , పాఠశాల కమిటీ చైర్మన్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana