e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home రంగారెడ్డి వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు

వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు

వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు

షాద్‌నగర్‌టౌన్‌, జూలై 18 : అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్‌హెచ్‌ 44 సమీపంలో పట్టణం ఉండడంతో అనునిత్యం వేలాది మంది ప్రజలు షాద్‌నగర్‌ మీదుగా రాకపోకలను సాగిస్తుంటారు. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలకు రాత్రిళ్లు సేద తీరేందుకు ఇబ్బందులు తలెత్తకుండా నైట్‌షెల్టర్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణానికి రూ. 46లక్షలు వెచ్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రయాణ మార్గంలో సేదతీరేందుకు నైట్‌షెల్టర్‌ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ప్రయాణికులకు ఉపయోగకరం..
అనునిత్యం పట్టణానికి ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రయాణికులు వస్తుంటారు. పట్టణంలో రాత్రి సమయాల్లో సేద తీరేందుకు నైట్‌షెల్టర్‌ ఏర్పాటు చేయడం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
-ప్రవీణ్‌, వ్యాపారి షాద్‌నగర్‌

- Advertisement -

నైట్‌షెల్టర్‌ ఏర్పాటు చేయడం సంతోషకరం..
షాద్‌నగర్‌ పట్టణానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రయాణికుల కోసం నైట్‌షెల్టర్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. షెల్టర్‌ భవనంతో రాత్రి సమయాల్లో దూర ప్రాంత ప్రజలకు ప్రయాణ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఉండడవు.
-వెంకట్‌రెడ్డి, షాద్‌నగర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు
వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు
వేగంగా నైట్‌షెల్టర్‌ భవన నిర్మాణ పనులు

ట్రెండింగ్‌

Advertisement