e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home రంగారెడ్డి రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి

రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి

రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి

వికారాబాద్‌, జూలై 14: రూ.10 కోట్లతో వికారాబాద్‌ మార్కెట్‌ యార్డు అభివృద్ధి చేయ నున్నట్టు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం వికారాబాద్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. వికారాబాద్‌లో పశువుల సంతకోసం ప్రభు త్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, దీంతో పశువు ల సంత జరిగేందుకు ఎలాంటి ఇబ్బందులు కలుగవన్నారు. కొత్తగడి సమీ పంలోని సర్వే నెం.28, గంగారం సర్వే నెం. 67లో పది ఎకరాల్లో గోదాంలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. అదేవిధంగా రూ.5కోట్లతో వికా రాబాద్‌లో 2 ఎకరాల స్థలంలో సమీకృత మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. న్యూ గంజ్‌లో రూ.36లక్షలతో కవర్‌షెడ్‌, రూ.30లక్షలతో సీసీ రోడ్డు, కూరగాయల గదుల నిర్మాణాలు చేపడుతామన్నారు. నైట్‌ షెల్టర్లను సైతం ఏర్పాటు చేస్తామని, దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌక ర్యవంతంగా ఉంటుందన్నారు.2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు రూ. 1.2కోట్లు రాగా, 2020- 21 మార్చి వర కు రూ.3.73 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభు త్వం రైతుల అభివృద్ధికి కృషి చేయడంతోనే ప్రతి సంవత్సరం మార్కెట్‌ యార్డుకు ఆదాయం భారీగా పెరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ సహకారంతో మార్కెట్‌ యార్డు అభివృద్ధి జరుగుతుందన్నారు. కరోనా కారణంగా నిధులు వచ్చేందుకు ఆలస్యం అవుతున్నాయని, ఎమ్మెల్యే సహకారంతో నిధులు తెచ్చి మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అమ్రాది నర్సింహులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి
రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి
రూ. పదికోట్లతో మార్కెట్‌యార్డ్‌ అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement