e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home రంగారెడ్డి ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం

ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం

ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం

వికారాబాద్‌, జూలై 20 : టీఆర్‌ఎస్‌ పాలనలో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తెలిపారు. మంగళవారం వికారాబాద్‌ మండల పరిధిలోని కొటా లగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ రోడ్డు సమస్యను పరిష్కరించేం దుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిధులు రాగానే ప్రాధాన్యత క్రమంలో పను లు చేపడుతామన్నారు. జనాభాను బట్టి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు నేరుగా గ్రామ పంచాయతీకే అందిస్తుందన్నారు. గ్రామ సంఘం ద్వారా తీర్మానం చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించుకో వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్‌ తీగలను సరి చేయాలని విద్యుత్‌ అధికారులు సూచించారు కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని, సర్పంచ్‌ రాములునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, ఎంపీడీవో సుభాషిణి, పార్టీ మండల అధ్యక్షుడు పురుషోత్తం, ఎంపీటీసీ గౌసొద్దీన్‌, సిద్దులూర్‌ సర్పంచ్‌ అంజయ్య, మిషన్‌ భగీరథ ఏఈ రవి పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం

ట్రెండింగ్‌

Advertisement