e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home రంగారెడ్డి పల్లెప్రగతితో మారిన పల్లె రూపురేఖలు

పల్లెప్రగతితో మారిన పల్లె రూపురేఖలు

  • గ్రామంలోని రహదారులన్నీ హరితమయం
  • పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ
  • రూ.40లక్షల ఎండోమెంట్‌ నిధులతో రామమందిర నిర్మాణం

ఆమనగల్లు, ఆగస్టు4: ఆధ్యాత్మికత, ఆహ్లాదక వాతావరణానికి కేరాఫ్‌గా అన్మాస్‌పల్లి నిలుస్తున్నది. కడ్తాల మండలానికి కూతవేటు దూరంలో ఉన్న అన్మాస్‌పల్లి నూతన పంచాయతీ ఏర్పాటైంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె అభివృద్ధి పథంలోకి అడుగులు వేస్తున్నది. గ్రామానికి వేళ్లేదారిలో నలువైపులా హరితహారంలో నాటిన మొక్కలు మనకు దర్శనమిస్తాయి. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పచ్చని తోరణాలుగా స్వాగతం పలుకుతున్నాయి. గ్రామ శివారులో ఒకవైపు పచ్చని పంట చేలు, మరోవైపు ఆధ్యాత్మికతను పంచే ఆలయాలతో గ్రామం అలరారుతున్నది. శివారు ప్రాంతంలో రూ.40 లక్షల ఎండోమెంట్‌ నిధులతో రామమందిర నిర్మాణం, గ్రామానికి అతిసమీపంలో మహేశ్వర పిరమిడ్‌ క్షేత్రం దర్శనమిస్తుంటాయి. కడ్తాల మండలం నుంచి వీడిపోయి పుల్లోరుబోడుతండా, జమ్ములబావి తండాను కలుపుకొని అన్మాస్‌పల్లి గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడింది. ఆనాటి నుంచి అన్మాస్‌పల్లి పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గ్రామంలో 1000 జనాభా, 650 ఓటర్లు ఉన్నారు.

గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు
రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.40 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.3.50 లక్షలతో పల్లెప్రకృతివనం, రూ.6 లక్షలతో అంతర్గత మురుగు కాల్వలు, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.2 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు, రూ.50 వేలతో చెత్త బుట్టల పంపిణీ, రూ.40 లక్షల ఎండోమెంట్‌ నిధులతో రామాలయం, రూ.90 లక్షలతో బీటీరోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.

- Advertisement -

మారిన గ్రామం రూపురేఖలు
పల్లెలను అభివృద్ధి వైపు తీసుకేళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామం దశనే మార్చింది. అన్మాస్‌పల్లి గ్రామం పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది. హరితహారం, ఆరోగ్య భద్రత అంశాల్లో ప్రజలు చైతన్యవంతులయ్యారు. సర్పంచ్‌ శంకర్‌ ఆధ్వర్యంలో పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శ రామచంద్రారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నడుంబిగించారు. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. వైకుంఠధామం, సీసీ రోడ్డు, అంతర్గత మురుగు కాల్వల నిర్మించారు. కాలనీల్లో వీధి దీపాల జిగేలుతో గ్రామం కళకళలాడుతున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 కి.మీ, ముచ్చర్ల ఫార్మాసిటీకి 5 కి.మీ దూరం ఉండడంతో గ్రామం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతున్నది.

మోడల్‌ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
పంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే నా కల. పల్లెప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించాం. వీధి దీపాలు, అంతర్గత మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రంథాలయం ఏర్పాటు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేశాం. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిచేందుకు కృషిచేస్తాం. మండలంలో అన్మాస్‌పల్లికి ప్రత్యేకత తీసుకొచ్చేలా కృషి చేస్తా.
– శంకర్‌, సర్పంచ్‌, అన్మాస్‌పల్లి

అందరి సహకారంతో అభివృద్ధి
పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, దాతల సహకారంతో అన్మాస్‌పల్లిని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాం. ప్రధాన సమస్యలు గుర్తిం చి వాటి పరిష్కారానికి కృషి చేస్తు న్నాం. తాగునీరు, మురుగు కా ల్వలు నిర్మించాం. ఇంటింటికీ చెత్త బుట్టలు పంపి ణీ చేశాం. పంచాయతీకి మరింత గుర్తింపు వచ్చే లా అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా చేస్తా.

  • రామచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, అన్మాస్‌పల్లి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana