చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత బంధుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న దళితులు అభివృద్ధి చెందేందుకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలను ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు. లబ్ధిదారులు ఉత్తమ వ్యాపారాలు ఎంపిక చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. దళిత బంధు రూ.10 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. దశల వారీగా ఈ పథకం ప్రతి ఒక్క దళితుడికి అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్, చేవెళ్ల డివిజన్ ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీలు మాలతి, కాలె శ్రీకాంత్, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్‌రావు, ఏడీఏ రమాదేవి, చేవెళ్ల వ్యవసాయ అధికారి కృష్ణమోహన్, చేవెళ్ల ఇన్చార్జి ఎంపీడీవో రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం సీఎం సహాయ నిధి
సీఎం సహాయ నిధి పేదలకు వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం చేవెళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 59 వేల చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నదని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా అధికారులు, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మొయినాబాద్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అనంత పద్మనాభ స్వామి కల్యాణం
చేవెళ్ల రూరల్, : చేవెళ్ల మండల పరిధి దేవరంపల్లి గ్రామంలో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం అనంత పద్మనాభ స్వామి వారి ఊరేగింపు, పంచామృతాభిషేకం, స్వామి వారి కల్యాణ మహోత్సవం, లక్షపుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు, దేవరంపల్లి సర్పంచ్ నరహరిరెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యను సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు రఘురామ చారి, ప్రభులింగం, ఉప సర్పంచ్ మల్లేశ్ పాల్గొన్నారు.