e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home రంగారెడ్డి చూడచక్కని చర్లపటేల్‌గూడ

చూడచక్కని చర్లపటేల్‌గూడ

చూడచక్కని చర్లపటేల్‌గూడ
  • ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
  • చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం
  • హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత
  • ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, వీధులన్నీ శుభ్రం
  • సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, వర్మీకంపోస్టు యార్డు నిర్మాణాలు పూర్తి

ఇబ్రహీంపట్నం రూరల్‌, జూలై 20 : ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చర్లపటేల్‌గూడ గ్రామం ‘పల్లె ప్రగతి’తో చకచకా అభివృద్ధి చెందుతున్నది. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధిక నిధులు కేటాయించారని, ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని సర్పంచ్‌ గీతా రాంరెడ్డి తెలిపారు. రెండేండ్ల కాలంలో గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠధామం, వర్మీ కంపోస్టు యార్డు నిర్మాణాలను పల్లె ప్రగతి మొదటి విడుతలోనే పూర్తి చేసి, నియోజకవర్గంలోనే గ్రామం ఆదర్శంగా నిలిచింది. నిత్యం వీధులను శుభ్రం చేయడంతోపాటు కలుపుమొక్కలను తొలగిస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు ప్రతి రోజు నీరు పడుతున్నారు. దీంతో స్వచ్ఛతకు మారుపేరుగా గ్రామం మారింది. త్వరితగతిన గ్రామం అభివృద్ధి చెందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం
‘పల్లె ప్రగతి’ మొదటి విడుతలోనే చర్లపటేల్‌గూడ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. దీంతో జిల్లాలోనే ఏ గ్రామంలో లేని విధంగా చిట్టడవిని తలపించేలా మొక్కలు ఏపుగా పెరిగాయి. పిచ్చుకలు, నెమళ్ల వంటి పక్షులు పల్లె ప్రకృతి వనాన్ని ఆవాసంగా మార్చుకుని జీవిస్తున్నాయి. ప్రకృతి వనంలో అరటి, బొప్పాయి, జామ, బత్తాయి, సపోటా వంటి పండ్ల మొక్కలు పెద్దవై ఫలాలను ఇస్తున్నాయి.

- Advertisement -

తెల్లవారకముందే వీధులన్నీ శుభ్రం..
చర్లపటేల్‌గూడ గ్రామంలో తెల్లవారకముందే పంచాయతీ సిబ్బంది రోడ్లన్నింటినీ శుభ్రం చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో కంపోస్ట్‌ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు, పల్లె ప్రకృతి వనం, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కలకు పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని పడుతున్నారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను ఏరోజుకారోజు తొలగిస్తూ స్వచ్ఛ పల్లెగా తీర్చిదిద్దుతున్నారు.

‘పల్లె ప్రగతి’తో గ్రామాభివృద్ధి..
‘పల్లె ప్రగతి’ కార్యక్రమానికి తోడుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకారంతో గ్రామం త్వరితగతిన అభివృద్ధి చెందింది. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో అధిక నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ తాగునీరు, కమ్యూనిటీ భవనాలు, వీధి లైట్లతో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టాం. గ్రామంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తున్నాం. జిల్లాలోనే చర్లపటేల్‌గూడ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

  • గీతా రాంరెడ్డి, సర్పంచ్‌ చర్లపటేల్‌గూడ

పక్కాగా పారిశుధ్య నిర్వహణ..
గ్రామంలో పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నాం. నిత్యం ఉదయం ఇంటింటికీ ట్రాక్టర్‌తో వెళ్లి చెత్త సేకరణతో పాటు రోడ్లనూ శుభ్రం చేయిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మరిన్ని మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి సిద్ధంగా ఉంచాం. పల్లె ప్రగతి మొదటి విడుతలోనే వైకుంఠధామం, కంపోస్టుయార్డు, పల్లె ప్రకృతి వనం వంటి పనులను పూర్తి చేశాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ సిబ్బంది పాత్ర కీలకం.

  • జయమ్మ, పంచాయతీ కార్యదర్శి చర్లపటేల్‌గూడ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చూడచక్కని చర్లపటేల్‌గూడ
చూడచక్కని చర్లపటేల్‌గూడ
చూడచక్కని చర్లపటేల్‌గూడ

ట్రెండింగ్‌

Advertisement