e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home రంగారెడ్డి కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం

కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం

కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం

కడ్తాల్‌, జూన్‌ 17 : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌, జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌గుప్తా, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చారు. మండలంలో సర్వేయర్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని కడ్తాల్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తాసీల్దార్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. గ్రామాల్లో చెరువులు, కుంటలు, నాలాలు అన్యాక్రాంతమవుతున్నాయని జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సర్పంచ్‌ తులసీరాంనాయక్‌, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి సభలో లేవనెత్తగా త్వరలో ప్రభుత్వ భూములకు సర్వే నిర్వహించి హద్దురాళ్లు పాతుతామని తాసీల్దార్‌ వివరించారు. ముద్విన్‌లో పంచాయతీ, పశువైద్యశాల భవనాలు లేకపోవడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ యాదయ్య ప్రశ్నించారు. అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని కడ్తాల్‌ సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి సభలో లేవనెత్తారు.

గోదాంలు నిర్మించాలి..
మండల కేంద్రంలో వ్యవసాయ గోదాంలను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నదని, భూమిని కేటాయిస్తే నిర్మాణాలు చేపడతామని పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గుప్తా సభలో అడగగా, స్థలాలను పరిశీలిస్తున్నామని ఎంపీడీవో రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గోపాల్‌, లచ్చిరాంనాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాములుగౌడ్‌, ప్రియ, ఉమావతి, మంజుల, నిర్మల, కోఆప్షన్‌ సభ్యుడు జహంగీర్‌బాబా, సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, హరిచంద్‌నాయక్‌, తులసీరాంనాయక్‌, యాదయ్య, కృష్ణయ్యయాదవ్‌, సులోచన, పూజా, కమ్లీ, హంశ్య, భాగ్యమ్మ, సుగుణ, సేవ్యాబావోజీ, రవీందర్‌, ఏంఈవో సర్దార్‌నాయక్‌, ఆర్‌ఐ సురేందర్‌, ఏఈలు, ఏపీఏం రాజేశ్వరి, పోలీస్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం
కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం
కలసికట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం

ట్రెండింగ్‌

Advertisement