మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Jun 06, 2020 , 21:20:57

సిరిసిల్ల డీపీఆర్వోకు ఉద్యోగోన్నతి

సిరిసిల్ల డీపీఆర్వోకు ఉద్యోగోన్నతి

రాజన్నసిరిసిల్ల : జిల్లా పౌరసంబంధాల అధికారి మామిండ్ల దశరథంకు సిద్ధిపేట జిల్లా సమాచారశాఖ ఏడీగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దశరథం ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రజాసంబంధాల అధికారిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా పౌరసంబంధాల అధికారిగా 3సంవత్సరాల 3 నెలలపాటు పని చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించారు. మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌ శ్రీకృష్ణ భాస్కర్‌ నుంచి ఉత్తమ అధికారిగా అవార్డులు సైతం అందుకున్నారు. 


logo