e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home కరీంనగర్ ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం

ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం

వేములవాడ రూరల్‌, నవంబర్‌ 22: అకాల వర్షాలతో రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని వేములవాడ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ ఏనుగు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సహకార సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం మాట్లాడారు. ఇప్పటి వరకు 74వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇంకా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు అధైర్యపడవద్దని.. కేంద్రాలకు తీసుకువచ్చిన ప్రతి గింజనూ కొంటామని భరోసానిచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. లారీల కోరత, రైస్‌ మిల్లుల్లో స్థల ప్రభావంతో కొనుగోళ్లలో కొంత ఆలస్యమైందన్నారు. మిల్లుర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు లారీలను సమకూరుస్తున్నామని, రైతులు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆయన వెంట పీఏసీసీ వైస్‌ చైర్మన్‌ తూం కాంతారావు, సీఈవో లక్ష్మణ్‌, సిబ్బంది ఉన్నారు.

మిలర్లు సహకరించాలి
ముస్తాబాద్‌, నవంబర్‌ 22: కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రైస్‌మిల్లర్లు సహకరించాలని ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు కోరారు. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన పోత్గల్‌ మార్కెట్‌ కమిటీ చెర్‌పర్సన్‌ శీలం జానాబాయి, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, మాట్లాడారు. అకాల వర్షాలతో కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తేమ శాతం వచ్చిన తర్వాత ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్‌, రైస్‌మిల్లు యజమానులు సహకరించాలని కోరారు.

- Advertisement -

రుద్రంగి, నవంబర్‌ 22: బడితండా, వీరునితం డా, సర్పంచ్‌తండా గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మానాల పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏలేటి చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి వైస్‌ఎంపీపీ పీసరి భూమ య్య ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర చెల్లిం చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని భూమయ్య తెలిపారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దేగావత్‌ తిరుపతి, సర్పంచులు మాలోత్‌ రమణయ్య, మానాల పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అంబర్‌సింగ్‌, నాయకులు గజన్‌లాల్‌, మోహన్‌, రాజు, కోడూరి రమేశ్‌, దేవా, ఖీమానాయక్‌, గంగారాం, మహిపాల్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు, సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement