e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News టెక్స్‌టైల్‌ పార్క్‌లో యూపీ హైకోర్టు జడ్జి

టెక్స్‌టైల్‌ పార్క్‌లో యూపీ హైకోర్టు జడ్జి

టెక్స్‌టైల్‌ పార్క్‌లో యూపీ హైకోర్టు జడ్జి

ఆధునిక మరమగ్గాలతోపాటు వస్ర్తాల పరిశీలన
వేములవాడ, ధర్మపురి, కొండగట్టులో పూజలు

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 1: రాజన్న సిరిసిల్లలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌ను గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో హైకోర్టు జడ్జ్జి సంగీత చంద్ర సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లతోపాటు ఆధునిక మరమగ్గాలు, వస్త్ర ఉత్పత్తిని పరిశీలించారు. యూనిట్‌ యజమానులు, కార్మికులతో మాట్లాడారు. పార్క్‌లోని మౌలిక సదుపాయాలు, వస్త్ర ఉత్పత్తి విధానాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా వారిని అధికారులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు టీఏ జహాడ్‌, సిరిసిల్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మంజుల, తంగళ్లపల్లి తహసీల్దార్‌ సదానందం, యజమానులు, కార్మికులు ఉన్నారు.
వేములవాడ, ధర్మపురి, కొండగట్టులో పూజలు
ధర్మపురి/ వేములవాడ/మల్యాల, ఏప్రిల్‌ 1: ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి వారిని, వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని, కొండగట్టు ఆంజనేయస్వామి వారిని లక్నో హైకోర్ట్‌ న్యాయమూర్తి సంగీత చంద్ర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆలయాల అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. వేములవాడ ఆలయ ప్రాంగణంలో జడ్జికి పోలీసులు గౌరవ వందనం చేశారు. ఆలయ ఏఈవో సంకెపల్లి హరికిషన్‌ ఆమెకు పూల మొక్కను అందజేశారు. రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయాల అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవోలు చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, జగిత్యాల ఆర్డీవో మాధురి, తహసీల్దార్‌ రవీందర్‌, సీఐలు రాంచందర్‌రావు, వెంకటేశ్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, అర్చకులు, ఆలయాల సిబ్బంది ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టెక్స్‌టైల్‌ పార్క్‌లో యూపీ హైకోర్టు జడ్జి

ట్రెండింగ్‌

Advertisement