e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home కరీంనగర్ నిరుపేదల సంక్షేమమే ధ్యేయం

నిరుపేదల సంక్షేమమే ధ్యేయం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
లబ్ధిదారులకు రేషన్‌కార్డుల పంపిణీ

కమాన్‌పూర్‌, జూలై 26: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. కమాన్‌పూర్‌లోని ఓ గార్డెన్‌లో సోమవారం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. కమాన్‌పూర్‌లో 85, గుండారం 16, పెంచికల్‌పేట 18, జూలపల్లి 46, పేరపల్లి 7, గొల్లపల్లి 5, రొంపికుంట 25, నాగారంలో 10 కుటుంబాలకు కొత్తరేషన్‌ కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ ఉమా శంకర్‌, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచులు నీలం సరిత, బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, తాటికొండ శంకర్‌, కట్కం రవీందర్‌, ఆకుల ఓదెలు, తొగరి అన్నపూర్ణ, కొండ వెంకటేశ్‌, ఎంపీటీసీ సభ్యులు కోలేటి చంద్రశేఖర్‌, గొడిసెల ఉమా, ఓఎస్డీ సయ్యద్‌ సలీమ్‌ అహ్మద్‌, డీటీ వినయ్‌కుమార్‌, ఆర్‌ఐలు బండి పోచయ్య, సముదాన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంథని టౌన్‌, జూలై 26: మంథనిలోని ఓ గార్డెన్‌లో కొత్త రేషన్‌ కార్డులను జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధూకర్‌ మాట్లాడారు. మంథని మండలంలో మొదటి విడుతగా 700కు పైగా కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిగ తా కార్డులను సైతం త్వరలోనే అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్‌, తహసీల్దార్‌ బండి ప్రకాశ్‌, జడ్పీటీసీ తగరం సుమలత, పీఏసీఎస్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ శ్రీరాంభట్ల సంతోషిణి, కౌన్సిలర్లు వీకే రవి, గర్రెపెల్లి సత్యనారాయణ, లింగయ్య, కోఆప్షన్‌ సభ్యుడు యాకుబ్‌, నాయకులు రాధాకృష్ణ, గుండా పాపారావు తదితరులు పాల్గొన్నారు.
రామగిరి, జూలై 26 : రామగిరి తహసీల్‌ కార్యాలయం ఆవరణలో 403 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను జడ్పీ చైర్మన్‌ పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ మ్యాదరవేన శారద, కమాన్‌పూర్‌ ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ గౌడ్‌, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ మ్యాదరవేన కుమార్‌ యాదవ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్‌ ఇందారపు పుష్పలత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శంకేసి రవీందర్‌, సర్పంచులు బుర్ర పద్మ, గంట పద్మ, పల్లె ప్రతిమ, బడికెల విజయ, అల్లం పద్మ, రామగిరి లావణ్య, దేవునూరి రజిత, కొండవేన ఓదెలు, పాశం ఓదెలు, నాగరాజ్‌, హరీశ్‌, ఎంపీటీసీలు ధర్ముల రాజసంపత్‌, మేడగోని ఉమ, సందీప్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కాపురబోయిన భాస్కర్‌, బుర్ర శంకర్‌ గౌడ్‌, అల్లం తిరుపతి, బడికెల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, జూలై 26: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతాఅశోక్‌ యాదవ్‌, తహసీల్దార్‌ సుధాకర్‌ లబ్ధిదారులకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. 264 కొత్త కార్డులు అందజేశామని తహసీల్దార్‌ సుధాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుజ్జుల రాజిరెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ అత్తె చంద్రమౌళి, వైస్‌ ఎంపీపీ రవీందర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు నూనె కుమార్‌, అల్లం తిరుపతి, ఎంపీటీసీలు పోతిపెద్ది కిషన్‌రెడ్డి, రామగళ్ల పోశమ్మమధుకర్‌, దొడ్డ గీతరాణి బాలాజీ, సర్పంచులు సరికొండ బక్కారావు, సంపత్‌రావు, సమ్మయ్య, మహేందర్‌ యాదవ్‌, సతీశ్‌గౌడ్‌ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana