e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home జిల్లాలు మొక్కలు నాటి..అభిమానాన్ని చాటి..

మొక్కలు నాటి..అభిమానాన్ని చాటి..

జిల్లావ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
కేక్‌లు కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబురాలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలు
సిరిసిల్ల టౌన్‌, జూలై 24: సిరిసిల్ల మున్సిపల్‌ లో లక్ష మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా వర్షాలతో నష్టపోయిన బాధితులకు రూ.వెయ్యి ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంత రం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 150 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ నేత సయ్యద్‌ షాదాబ్‌, టీఆర్‌ఎస్వీ నేత అఫ్రోజ్‌, పట్టణ పద్మశాలీ సంఘం ఆధ్వర్యం లో 80మంది రక్తదానం చేశారు. టీఆర్‌ఎస్‌ నేత కొమిరె సంజీవ్‌గౌడ్‌ నివాసంలో నిర్వహించిన వేడుకల్లో చైర్‌పర్సన్‌ జిందం కళ పాల్గొని మొక్క లు నాటారు. 5వ వార్డులో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహా య కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌ స్థానిక కౌన్సిలర్‌ దార్నం అరుణతో కలిసి మొక్కలు నాటారు. 13 వ వార్డులో అర్బన్‌ బ్యాంకు డైరెక్టర్‌ నేరెళ్ల శ్రీకాంత్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చైర్‌పర్సన్‌ ప్రారంభించారు. రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మాండ్లు వంద మం ది ఆశ కార్యకర్తలకు చీరెలు పంపిణీ చేశారు. వెల మ సంక్షేమ మండలి జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పద్మనాయక కల్యాణ మండపం వద్ద మొక్కలు నాటారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌వై ఆధ్వర్యంలో సాయినగర్‌లోని ఈద్గా వద్ద మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఆధ్వర్యంలో ప్రభు త్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కేక్‌ను పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి కట్‌ చేశారు. నెహ్రూనగర్‌లో టీఆర్‌ఎస్‌ నేత తాటి వెంకన్న ఆధ్వర్యంలో, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు చందర్‌రావు ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌక్‌లో స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ అగ్గి రాములు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్‌, టీఆర్‌ఎస్‌, అనుబంధ సం ఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
వేములవాడ, జూలై 24: మంత్రి కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న సన్నిధిలో స్వామివారికి కోడె మొక్కు చెల్లించారు. నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. చెక్కపల్లి రహదారిలో మొక్కలు నాటారు. వెయ్యి మొక్కలు నాటి నాలుగు వేల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశామని ఇన్‌చార్జి కమిషనర్‌ నర్సింహస్వామి తెలిపారు. ఇక్కడ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజ య్‌, జడల లక్ష్మి, మారం కుమార్‌, సిరిగిరి రామ్‌చందర్‌, యాచమనేని శ్రీనివాసరావు, కొండ పావని, నరాల శేఖర్‌, గోలి మహేశ్‌, ఇప్పపూల అజయ్‌, బింగి మహేశ్‌, కో ఆప్షన్‌ సభ్యులు కట్కూరి శ్రీనివాస్‌, బాబున్‌, ఏఎంసీ డైరెక్టర్లు ఫీర్‌ మహ్మద్‌, కమలాకర్‌రెడ్డి, నాయకులు రామతీర్థపు రాజు, గుడూరి మధు, యాదగిరి ప్రసాద్‌రావు, కొండ నర్సయ్య, నీలం శేఖర్‌, క్రాంతికుమార్‌, కుమ్మరి శ్రీనివాస్‌, టైలర్‌ శ్రీనివాస్‌, వెంగళ శ్రీకాంత్‌గౌడ్‌, వంగళ శ్రీనివాస్‌, మల్లేశం, కొండ కనకయ్య ఉన్నారు.
సిరిసిల్ల రూరల్‌, జూలై 24: తంగళ్లపల్లి మం డల కేంద్రంలో ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఏఎంసీ చైర్మన్‌ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్నతో కలిసి సీనియర్‌ కేక్‌ కట్‌ చేశారు. అనంత రం మొక్కలు నాటారు. చీర్లవంచలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు వంద మంది వృద్ధులకు గొడుగులను అందజేశారు. చంద్రంపేటలోని జిల్లా రైతు వేదిక వద్ద ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో మొక్కలు నా టారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్‌ 9వ వార్డు పరిధిలో కౌన్సిలర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నబోనాలలో రైతు వేదికలో విజయ డెయిరీ జిల్లా అధ్యక్షుడు, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ దడిగెల శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. ఇక్కడ గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎర్రవెల్లి వెంకటరమణరావు, కౌన్సిలర్లు పోచవేని సత్య, పాతూరి రాజిరెడ్డి, కల్లూరి లత, దార్నం అరుణ, గడ్డం లత, పోచవేని ఎల్లయ్యయాదవ్‌, గుగ్గిళ్ల అజయ్‌, తిరుపతి, సాయి, బాలయ్య, శ్రీనివాస్‌, జూపల్లి శ్రీనాథరావు, పూర్ణచందర్‌, సలీం, రవికుమార్‌, శ్రీనివాస్‌, నర్సయ్య ఉన్నారు.
అలాగే తంగళప్లల్లి మండల వ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో వైస్‌ ఎంపీపీ జంగిటి అంజ య్య, పీఏసీఎస్‌ చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్‌, కోడూరి భాస్కర్‌గౌడ్‌, సర్పంచుల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, చెన్నమనేని వెంకట్రావు, పుర్మాణి రాంలింగారెడ్డి, పడిగెల రాజు, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ రాజిరెడ్డి, పెద్దూరి తిరుపతి, ఎంపీటీసీ కోడి అంత య్య, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, ఎఫ్‌ఎస్‌వో శ్రీనివాస్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు మోర నిర్మల, టీఆర్‌ఎస్‌వై మండలాధ్యక్షుడు నక్క ప్రేమ్‌కుమార్‌, పబ్బతి విజయేందర్‌రెడ్డి, అంకారపు రవీందర్‌, అంకారపు అనిత, పూసపల్లి సరస్వతి, అబ్బాడి అనిల్‌రెడ్డి, కొత్త సంతోష్‌, నులుగొండ శ్రీనివాస్‌, బండి దేవేందర్‌ యాదవ్‌, సిలువేరి చిరంజీవి, నర్సయ్య, వేముల శ్రీనివాస్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బైరి ప్రభాకర్‌, ఎండీ హమీద్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి షాబొద్దీన్‌, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో పెద్దూరులోని గౌడ సంఘం భూమిలో 500 ఈత గింజలను వెదజల్లి, 50 ఈత మొక్కలు నాటారు. ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, విజేందర్‌, శేఖర్‌, గౌడ సంఘం అధ్యక్షుడు దేవాగౌడ్‌, బాలరాజుగౌడ్‌, కౌన్సిలర్లు భూక్యా రెడ్యానాయక్‌, సత్యనారాయణ, గండ్ర రమేశ్‌రావు, తిరుపతి, చిన్న దేవాగౌడ్‌, సల్లూరి అంజయ్య, అతికం రమేశ్‌, బైరగోని పరశురాములు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 24: మండల కేంద్రంలో ని పల్లె ప్రకృతి వనంలో ఐదు వేల మొక్కలు నా టారు. అనంతరం డబుల్‌బెడ్రూం సముదాయం వద్ద భోజనాలు చేశారు. రాజన్నపేటలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో టీఆర్‌ఎస్‌ నాయకులు రకదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా గొల్లపల్లికి చెందిన దాసారపు కిషన్‌-కవిత దంపతుల కుమారుడు రాజేశ్‌కు టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ ఆధ్వర్యంలో ట్రై సైకిల్‌ను అందజేశారు. మండల కేంద్రంలో కేటీఆర్‌ అక్షరాల మాల రూపంలో నిలబడి అమాత్యుడికి శుభాకాంక్షలు తెలిపారు. బొప్పాపూర్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేశ్‌గౌడ్‌, ఎల్లారెడ్డిపేట డబుల్‌ బెడ్రూంల వద్ద సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి అన్నదానం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేశ్‌గౌడ్‌, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ రాధారపు శంకర్‌, మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్‌ చైర్మ న్‌ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచులు నేవూరి వెం కట్‌రెడ్డి, పాశం సరోజన, మాలోత్‌ సునీత, యూత్‌వింగ్‌ నాయకులు ఎడ్ల లక్ష్మణ్‌, ములిగె ప్రమోద్‌, మహ్మద్‌ సద్దాం, సింగారపు మధు, కొర్రి అనిల్‌, కుడుకుల మహేశ్‌, మేడిశెట్టి మల్లే శం, నిమ్మల బాబు, సింగారం దేవరాజు, గుర్రాల రాజిరెడ్డి, చందనం శివ, ఎంపీడీవో చిరంజీవి, ఏపీవో కొమురయ్య, నమిలికొండ శ్రీనివాస్‌, గోగూరి చంద్రారెడ్డి, సంకూరి శంకర్‌, నమిలికొండ నర్సయ్య, తోకల శివారెడ్డి పాల్గొన్నారు.
అన్నార్థులకు అండగా..
మండల కేంద్రంలో సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి పేదల ఆకలి తీర్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుభాకార్యాల్లో మిగిలిపోయిన భోజనం పడేయకుండా ఫోన్‌ చేస్తే తీసుకెళ్లి పేదలకు పంచిపెట్టేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎంపీపీ రేణుక ప్రారంభించారు. ఇక్కడ మాజీ సర్పంచ్‌ నేవూరి మమతారెడ్డి, ఉన్నారు.
వీర్నపల్లి, జూలై 24: రంగంపేట మంకీ ఫుడ్‌ కోర్టు, బావుసింగ్‌తండా శివారులోని అటవీ ప్రాం తంలో జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి, ఎంపీపీ మాలోత్‌ భూల, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ ఎడ్ల సాగర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి మొక్కలు నాటారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇక్కడ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ బోడ జగన్‌, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ సు రేశ్‌, వైస్‌ ఎంపీపీ ఈసంపల్లి హేమ, సర్పంచులు లింగం, దినకర్‌, మల్లే శం, రవినాయక్‌, ఉప సర్పంచులు రవి, రామస్వామి, నేతలు మల్లేశం, భాస్కర్‌, ప్రభాకర్‌, చంద్రం, రంజిత్‌, రఫీ, దేవేందర్‌, అజయ్‌ ఉన్నారు.
సిరిసిల్ల/ముస్తాబాద్‌, జూలై 24: ముస్తాబాద్‌ మండలం గూడురుకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ పీఏ సీహెచ్‌ వెంకటేశ్వర్‌రావు సొంత ఖర్చులు రూ.65వేలతో స్వగ్రామంలో వివిధ రకాలైన 400మొక్కలను ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటారు. ఇక్కడ సర్పంచ్‌ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు శ్రీనివాస్‌ ఉన్నారు. అలాగే కలెక్టరేట్‌లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు మొక్కలు నాటారు.
వేములవాడ రూరల్‌, జూలై 24: తిప్పాపూర్‌లోని వంద పడకల ప్రభుత్వ దవాఖానలో టీఆర్‌ఎస్‌ నేతలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అగ్రహారం హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. వేడుకల్లో వేములవాడ ఏఎంసీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, జడ్పీటీసీ మ్యాకల రవి, ఎం పీపీ బూర వజ్రమ్మ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఏశ తిరుపతి, ఊరడి రాంరెడ్డి, వైస్‌ ఎం పీపీ ఆర్సీరావు, సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, సర్పంచులు మల్లారం తిరుపతి, చెన్నమనేని స్వయంప్రభ, పెండ్యాల తిరుపతి, సుమన్‌, మల్లే శం, వెంకటరమణ, రాణి, సునీత, రాజేశం, ఎం పీటీసీలు దేవరాజు, నేతలు బూర బాబు, మధు, కమలాకర్‌, లక్ష్మణ్‌, పరశురాములు, శ్రీనివాస్‌, జడల శ్రీనివాస్‌, రాములు, అంజనీకుమార్‌, బాలు, ఈర్యానాయక్‌, చంద్రయ్య పాల్గొన్నారు.
చందుర్తి, జూలై 24: నర్సింగాపూర్‌లో ఎంపీపీ బైరగోని లావణ్య, ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు పొ న్నాల శ్రీనివాస్‌రావు, తిప్పని శ్రీనివాస్‌, సర్పంచ్‌ రాపెల్లి గంగాధర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఇక్కడ ఎంపీడీవో రవీందర్‌, ఎంపీవో ప్రదీ ప్‌, ఎక్సైజ్‌ సీఐ రాము, ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏపీవో రాజయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు కమలాకర్‌, పంచాయతీ కార్యదర్శి రమేశ్‌, నాయకులు నరేశ్‌, గుర్రం నర్సయ్య, మురళి, పరశురాములు, దేవయ్య పాల్గొన్నారు.
మరిన్ని సేవలందించాలి
బోయినపల్లి, జూలై 24: యంగ్‌ డైనమిక్‌ లీడ ర్‌ మంత్రి కేటీఆర్‌ పేదలకు మరిన్ని సేవలందించి, భవిష్యత్‌ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్‌రావు కోరారు. శనివారం ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్వగ్రామంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు అద్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కొదురుపాక అడ్డ రహదారి నుంచి హైలెవల్‌ వంతెన వరకు డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటారు. అనంతరం రైతు వేదిక వద్ద కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. అలాగే పలు గ్రామాల్లో వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకులు జోగినపల్లి ప్రేమ్‌ సాగర్‌రావు, డీసీమ్మెస్‌ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ యుగేందర్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఐ విద్యాసాగర్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌వో సౌమ్య, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, ఏఎంసీ చైర్మన్‌ కవంపల్లి లక్ష్మి, వైస్‌ ఎంపీపీ నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, కోరెం పీఏసీఎస్‌ చైర్మన్‌ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, సర్పంచులు బూ ర్గుల నందయ్య, ఇల్లందుల శంకర్‌, చిందం రమే శ్‌, గోపాల్‌రెడ్డి, సత్యానారాయణరెడ్డి, కొదురుపాక ఉప సర్పంచ్‌ రవిచందర్‌, ఏపీవో సబిత, ఎం పీటీసీలు ఐరెడ్డి గీత, ఉపేందర్‌, ఏఎంసీ డైరెక్టర్లు అనిల్‌, మల్లేశం, పార్టీ మంలాధ్యక్షుడు మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుముల భాస్కర్‌, రాములు, ముద్దం రవి, నారాయణరెడ్డి, లక్ష్మీరాజం, సుధాకర్‌, శంకర్‌, మధు, బాలమల్లు, సుధాకర్‌రావు, మల్లారెడ్డి, రాజు పాల్గొన్నారు.
రుద్రంగి, జూలై 24: మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. మానాలలో మహిళా సంఘ భవనం ఆవరణలో గ్రామశాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం, సర్పంచ్‌తో కలి సి వైస్‌ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య మొక్కలు నాటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గౌడ కులస్తులతో కలిసి 2వేల మొక్కలు నాటారు. ఇక్క డ ఎంపీడీవో శంకర్‌, ఎక్సైజ్‌ సీఐ రాము, ఎంపీ వో సుధాకర్‌, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమి టీ చైర్మన్‌ కొమురె శంకర్‌, ఏఎంసీ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆకుల భూమక్క, కో ఆప్షన్‌ సభ్యుడు జమీలా బేగం, సర్పంచులు తర్రె ప్రభలత, అల్లూరి మాన స, నాయకులు గంగం మహేశ్‌, మాడిశెట్టి ఆనం దం, మంచె రాజేశం, చెప్యాల గణేశ్‌, ఆకుల గం గారాం, పిప్పరి మోహన్‌, అంబటి రాములు, కాదాసు లక్ష్మణ్‌, గొళ్లెం నర్సింగ్‌, కొడగంటి శ్యా మ్‌, మరిగడ్డ సతీశ్‌, ఉప్పులూటి గణేశ్‌, భూమానాయక్‌, మోతె నర్సయ్య, పూదరి శ్రీనివాస్‌, దాసరి గంగారాజం, మధు, ఉపేందర్‌ ఉన్నారు.
గంభీరావుపేట, జూలై 24:మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గంగమ్మ గుడి వద్ద కేక్‌ కట్‌ చేసి మొక్కలు నాటారు. యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా మండల కేంద్రంలో 16మంది పేదలకు మాజీ ఎంపీటీసీ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి చీరెలు పంపిణీ చేశారు. జగదాంబతండాలో నిరుపేద కుటుంబానికి చెందిన కోల రాజుకు సెస్‌ మాజీ డైరెక్టర్‌ కొక్కు దేవేందర్‌యాదవ్‌ రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. లింగన్నపేటలో ఎనిమిది పేద కు టుంబాలకు ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ భూపతి సురేందర్‌, వైస్‌ ఎంపీపీ దోసల లత, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, సర్పంచులు కొలుముల అంజమ్మ, బాల్యనాయక్‌, బాలరాజు, పిట్ల పావ ని, దొంతినేని చైతన్య, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సుతారి బాలవ్వ, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు మోతె రాజిరెడ్డి, కమటం రాజేందర్‌, ఎంపీటీసీ అంజిరెడ్డి, పీఏసీఎస్‌, ఏఎంసీ వైస్‌ చైర్మ న్లు రామాంజగౌడ్‌, యాదిలాల్‌, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, లింగన్నగారి దయాక్‌రావు, కమ్మరి రాజారాం, బిల్లా రాజు, కొలుముల బాల్‌రెడ్డి, చెవుల మల్లేశం, కామిడి సదాశివరెడ్డి, గంద్యాడపు రాజు, ఎర్ర ఎల్లాగౌడ్‌, రెడ్డిమల్ల రాజనర్సు, రాజు, శ్రీమతి, సురేశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana