e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home కరీంనగర్ రికార్డు స్థాయిలో వర్షం

రికార్డు స్థాయిలో వర్షం

సిరిసిల్ల, జూలై 23: జిల్లాలో వానలు దంచికొట్టాయి. మూడు రోజులుగా ముసురు పడడంతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమో దైంది. ఎక్కడా చూసిన వరద నీరే.. నిండిన కుంటలు, మత్తడులు దుంకిన చెరువులు, పరవళ్లు తొక్కిన ప్రాజెక్టులే దర్శనమిచ్చాయి. జూన్‌ 1నుంచి జూలై 22వ తేదీ వరకు జిల్లాలో 676.2 మిల్లీ మీట ర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది జిల్లాలో 410.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12మండలాల్లో 60శాతం కం టే అధికంగా వర్షాలు కురిశాయి. వేములవాడ రూరల్‌ మండలం లో మాత్రమే దాదాపు 20-60శాతం వర్షం కురిసిందని వాతావ రణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా రుద్రంగి లో 784.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వేములవాడ రూరల్‌లో 518.8మిల్లీమీటర్లు పడింది. శ్రీ రాజరా జేశ్వర జలాశయం గేట్లను ఎత్తివేయగా, ఎగువమానేరు ఉధృతంగా పరవళ్లు తొక్కుతున్నది.
కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలి
రుద్రంగి, జూలై 23: భారీ వర్షాలతో మండల కేంద్రంలోని కొచ్చగుంటతండాకు వెళ్లే దారిలోని కల్వర్టు కోతకు గురికావడంతో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్వర్టు కోతకు గురికావడం తో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని, ప్రవాహం తగ్గిన తర్వాత మరమ్మతులు చేపడుతామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం రుద్రం గి నుంచి కొచ్చగుంటతండాకు వెళ్లే దారి కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు కోసం సేకరించామని, తండాకు సంబంధించి మరో రోడ్డు నిర్మాణానికి ఇదివరకే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇక్కడ ఎంపీపీ గంగం స్వరూపారాణి, పంచాయతీరాజ్‌ డీఈ భూమేశ్‌, ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ తర్రె ప్రభలత తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం…
వేములవాడ, జూలై 23: భారీ వర్షాలతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థ పు మాధవి భరోసానిచ్చారు. పట్టణంలోని ఏడో వార్డులో స్వామి, శంకరయ్య ఇండ్లు కూలిపోగా, 10వ వార్డులో పెండ్యాల నాయక మ్మ పూరిగుడిసె నీటిలో మునిగిపోగా ఆమె పరిశీలించారు. కోనాయపల్లి రహదారిలోని బుడిగెజంగాల కాలనీ కూడా ముంపు నకు గురికాగా, వారికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అంద జేశారు. అలాగే మున్సిపల్‌ పరిధిలోని లాలపల్లి కాలనీకి వెళ్లే దారి లో వ్యవసాయ బావి కూలిపోగా చైర్‌పర్సన్‌ మాధవి, ఇన్‌చార్జి కమి షనర్‌ నర్సింహ స్వామి పరిశీలించారు. తక్షణమే మరమ్మతులతో పాటు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక్కడ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, తహసీల్దార్‌ మునీందర్‌, ఆర్‌ఐ కుమార్‌, కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్‌, జోగిని శంకర్‌, సిరిగిరి రామచందర్‌, యాచమనేని శ్రీనివాసరావు, అజయ్‌, మహేశ్‌, కోఆప్షన్‌ సభ్యులు శ్రీనివాస్‌, బాబున్‌, రామతీర్థపు రాజు, శ్రీనివాస్‌, మల్లేశం, క్రాంతికుమార్‌, శ్రీనివాస్‌, హరీశ్‌ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 23: బాకుర్‌పల్లి, గుంటపల్లి చెరువుతండా వాసులు ప్రయాణించేందుకు వీలుగా ఉన్న రెండు కాజ్‌వేలు పొం గి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గొల్లపల్లి గంగ మ్మ ఆలయం వద్ద రోడ్డు తెగిపోవడంతో రాజన్నపేట, దేవుని గుట్ట తండా, బాకుర్‌పల్లివాసులు ఇబ్బందిపడ్డారు.
చందుర్తి, జూలై 23: భారీ వర్షాలతో బండపల్లి చెరువు గురువా రం రాత్రి మత్తడి దుంకింది. దీంతో గ్రామస్తులు, రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మల్యాలలో నిరుపేద కుటుంబాని కి చెందిన పులి దేవయ్య ఇల్లు కూలిపోయింది. సర్పంచ్‌ గట్టు లక్ష్మీ నారాయణ, వైస్‌ ఎంపీపీ అబ్రహం పరిశీలించారు.
బోయినపల్లి, జూలై 23: బోయినపల్లికి చెందిన సావనపల్లి నారాయణ-శంకరవ్వ దంపతుల ఇల్లు కూలిపోగా, సర్పంచ్‌ గుంటి లతశ్రీ పరిశీలించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కోనరావుపేట, జూలై 23: ఇటీవల కురిసిన వర్షాలకు ఏగ్లాస్‌పూర్‌ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగును దాటేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. వంతెనను ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్‌, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్‌ దండు ఎల్లవ్వ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే నిజామాబా ద్‌, మామిడిపల్లి, వెంకట్రావుపేట, నిమ్మపల్లి గ్రామాల్లో మూల వాగు ఉధృతంగా ప్రవాహిస్తున్నది. ఆయా గ్రామాల ప్రజలు మూలవాగులో చేపలు పడుతూ సందడిగా గడిపారు.
ముస్తాబాద్‌, జూలై 23: మండలంలో 28 ఇండ్లు కూలిపోయి నట్లు తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. పలు గ్రామాల్లో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవ హిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana