లండన్: ఆదివారం జరిగిన యూరో ఫైనల్లో తమ టీమ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఇంగ్లండ్ అభిమానులు అరాచకం సృష్టించారు. స్టేడియంలోనే ఇటలీ అభిమానులపై చేయి చేసుకున్నారు. వాళ్లపై పిడిగుద్దులు కురిపిస్తూ.. కిందపడేసి తంతూ దారుణంగా వ్యవహరించారు. వాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఇటలీ జాతీయ జెండాను అవమానించారు. దానిపై ఉమ్ముతూ, కిందేసి తొక్కుతూ మరీ చిల్లరగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా వీధుల్లో రణరంగం సృష్టించారు. కొందరు రాళ్లు విసరడంతో పలు బిల్డింగ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫ్యాన్స్ అరాచకానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంగ్లండ్ అభిమానుల తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.