శనివారం 06 మార్చి 2021
Rajanna-siricilla - Jan 27, 2021 , 03:00:40

అభివృద్ధే ధ్యేయంగా పని చేశాం

అభివృద్ధే ధ్యేయంగా పని చేశాం

  • ఎమ్మెల్యే సహకారంతో నిధులు సమకూర్చాం
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి

వేములవాడ, జనవరి 26: మున్సిపల్‌ అభివృద్ధే ధ్యేయంగా పని చేశామని, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సహకారంతో సమర్థవంతంగా నిధులు సమకూరుస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి పేర్కొన్నారు. పాలకవర్గం ఏర్పడి బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రతి వీధిలో పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యమిచ్చామన్నారు. ఇంటింటా చెత్త సేకరణ కోసం 79లక్షలతో ఆటోలు కొనుగోలు చేసి డ్రైవర్లను నియమించామని తెలిపారు. పచ్చదనాన్ని కాపాడేందుకు 20లక్షలతో మొక్కలు, ట్రీ గార్డులు సమకూర్చామన్నారు. విలీన గ్రామాల్లోనూ 30లక్షలతో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొబైల్‌ టాయిలెట్లు, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు ఉద్యానవన పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 25లక్షలతో కూడళ్లను సుందరీకరించి సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేశామని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్ని వర్గాలకు అండగా ఉన్నామని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది పనితీరు అభినందనీయమని కొనియాడారు. అధికారులు, పాలకవర్గం అందించిన సహకారం మరువలేనిదని, రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


VIDEOS

logo