మువ్వన్నెల జెండా రెపరెపలు

- జెండా ఎగురవేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు
- మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపురాజన్న
సిరిసిల్ల నెట్వర్క్, జనవరి 26: 72వ గణతంత్ర వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు కలెక్టర్ కృష్టభాస్కర్ హాజరై, జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయా ప్రభు త్వ పథకాలతో కూడిన స్టాళ్లను జిల్లా అధికారులు సందర్శించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన 145మంది అధికారులు, ఉద్యోగులకు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎస్పీ రాహుల్‌హెగ్డేతో కలిసి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టరేట్, క్యాంపు కార్యాలయాల్లో కలెక్టర్ కృష్ణభాస్కర్, జిల్లా పోలీస్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డే, 17వ పోలీస్ బెటాలియన్‌లో అడిషనల్ కమాండెంట్ ఎన్ పెద్దబాబు, జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయంలో చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా కోర్టులో 9వ అదనపు జడ్జి జాన్సన్, ఎక్సైజ్‌లో సీఐ చంద్రశేఖర్, ఐసీడీఎస్‌లో సీడీపీవో అలేఖ్య, మున్సిపల్లో కమిషనర్ సమ్మయ్య, వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, జిల్లా దవాఖానలో సూపరింటెండెంట్ మురళీధర్‌రావు, టౌన్ క్లబ్లో అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు పాలమాకుల శేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిరిసిల్ల ఏంఎంసీలో చైర్మన్ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, సిరిసిల్ల, పెద్దూరు, నేరెళ్ల సింగిల్‌విండోల్లో చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, బర్కం వెంకటలక్ష్మి యాదవ్, కొడూరి భాస్కర్‌గౌడ్, వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు, తంగళ్లపల్లి తహసీల్‌లో తహసీల్దార్ సదానందం, మండల పరిషత్‌లో ఎంపీడీవో మదన్మోహన్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ అభిలాశ్, గంభీరావుపేట మండల పరిషత్‌లో ఎంపీపీ వంగ కరుణ, గాంధీ విగ్రహం వద్ద సర్పంచ్ శ్రీధర్, ఏఎంసీలో చైర్పర్సన్ సుతారి బాలవ్వ, తహసీల్‌లో శ్రీనివాస్, సెస్‌లో డైరెక్టర్ దేవేందర్ యాదవ్ జెండాను ఆవిష్కరించారు. విలేజ్ లర్నింగ్ సర్కిల్ పోటీల్లో బొప్పాపూర్ బెస్ట్ వీఎస్ఎల్గా ఎంపిక కాగా, ఎంఈవో రాజయ్య బహుమతులు అందజేశారు. వీర్నపల్లి మండల పరిషత్‌లో ఎంపీడీవో భారతి, తహసీల్‌లో అబ్దుల్ మజీద్, ముస్తాబాద్ మండల పరిషత్‌లో ఎంపీడీవో రమాదేవి, తహసీల్‌లో ఇన్చార్జి తహసీల్దార్ విజయ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మారెడ్డి, సహకార సంఘాల్లో చైర్మన్లు రాజేందర్‌రెడ్డి, బాపురావు, ఏఎంసీలో కార్యదర్శి ఇంద్రాసేనారెడ్డి, వ్యవసాయశాఖలో ఏవో వెంకటేశ్, పోత్గల్ పీహెచ్సీలో డాక్టర్ సంజీవరెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ కార్యాలయంలో డీఐఈ వో సత్యవర్ధన్‌రావు, జిల్లా విద్యాధికారి కార్యాలయం లో డీఈవో రాధాకిషన్, విద్యాసంస్థల్లో హెచ్ఎంలు, ఇల్లంతకుంట తహసీల్‌లో రాజిరెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రఫీక్‌ఖాన్, మండల పరిషత్‌లో ఎంపీడీవో విజయ జాతీయ జెండాను ఎగురవేశారు.
వేములవాడ కోర్టు ఆవరణలో న్యాయమూర్తి వినిల్‌కుమార్, మున్సిపల్లో కమిషనర్ శ్యాంసుందర్‌రావు, రాజన్న ఆలయంలో ఏవో కృష్ణప్రసాద్ , డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ చంద్రకాంత్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంకటేశ్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సత్యవర్దన్రావు, ప్రభుత్వ దవాఖానలో వైద్యాధికారి మహేశ్‌రావు, సబ్ రిజిస్ట్రార్‌లో ఇంతియాజొద్దీన్, పీఏసీఎస్‌లో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, మున్నూరుకాపు సంఘంలో చైర్మన్ బింగి శ్రీనివాస్, సెస్‌లో ఏఈ సుష్మ, ప్రెస్‌క్లబ్‌లో ఉపాధ్యక్షుడు బాబు యాదవ్, వేములవాడ మండల పరిషత్‌లో ఎంపీడీవో నరేశ్ఆనంద్, తహసీల్ల్లో మునీందర్, నక్క శ్రీనివాస్, పశు వైద్యశాలలో ప్రశాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖలో ఏవో చంద్రన్‌కుమార్, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తీగల రాజేశంగౌడ్, అగ్రహారం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, రాజగోపాల్, ఆర్టీసీ డిపోలో మేనేజర్ భూపతిరెడ్డి, అగ్రహారం హనుమాన్ ఆలయంలో ఏవో శ్రీనివాస్‌యాదవ్, వేములవాడ ఏఎంసీలో కార్యదర్శి సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చందుర్తి మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్, పీఏసీఎస్‌లో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సనుగుల పీఏసీఎస్‌లో కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్‌రావు, మండల పరిషత్‌లో ఎంపీడీవో రవీందర్, తహసీల్‌లో నరేశ్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ మొగిలి, వ్యవసాయ శాఖ లో ఏవో దుర్గరాజు, సెస్‌లో డైరెక్టర్ అల్లాడి రమేశ్, పీహెచ్సీలో మసూద్ అహ్మద్, వాణి విద్యాలయంలో హెచ్ఎం రాచర్ల రాజు, కోనరావుపేట తహసీల్‌లో నరేందర్, మండల పరిషత్‌లో ఎంపీడీవో రామకృష్ణ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు, పీహెచ్సీలో వైద్యాధికారి మోహన్‌కృష్ణ, సెస్‌లో డైరెక్టర్ తిరుపతి, పీఏసీఎస్‌లో చైర్మన్లు బండ నర్సయ్య యాదవ్, రాంమోహన్‌రావు, మండల వనరుల కేంద్రంలో ఎం ఈవో రఘపతి, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ సాగర్, కసూర్బాలో ప్రత్యేకాధికారి ఇందిరా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బోయినపల్లి తహసీల్‌లో యుగేంధర్, మండల పరిషత్‌లో ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్, ఐకేపీలో ఏపీఎం నర్సయ్య, మండల వనరుల కేంద్రంలో ఎంఈవో శ్రీనివాస్, కోరెంలో పీఏసీఎస్‌లో చైర్మన్ కిషన్‌రెడ్డి, సెస్‌లో డైరెక్టర్ ఏనుగుల లక్ష్మి, రుద్రంగి తహసీల్‌లో తహసీల్దార్ మహ్మద్ తఫాజుల్ హుస్సేన్, మండల పరిషత్‌లో ఎంపీడీవో శంకర్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ మహేశ్, ఏఎంసీలో చెర్మన్ పొన్నాల శ్రీనివాస్, వ్యవసాయ శాఖలో ఏవో అనూష జెండాను ఎగురవేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్ అంజయ్య, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్, ఆర్డీవో శ్రీనివాసరా వు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ దోర్నా ల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఎంపీపీలు జనగామ శరత్‌రావు, పిల్లి రేణుక, మాలోత్ భూల, బూర వజ్రమ్మ, చంద్రయ్యగౌడ్, పర్లపల్లి వేణుగోపాల్, గంగం స్వరూపారాణి, వెంకటరమణారెడ్డి, బండ మల్లేశం, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్‌రావు, గుండం నర్స య్య, మ్యాకల రవి, కత్తెరపాక ఉమాకొండయ్య, గట్ల మీనయ్య, సెస్ డైరెక్టర్లు కుంబాల మల్లారెడ్డి, గుడిసె ఐలయ్య, ఏనుగు విజయరామారావు, ఆర్బీఎస్ మం డల కన్వీనర్లు కల్వకుంట్ల గోపాల్‌రావు, రాధారపు శం కర్, వొజ్జల అగ్గి రాములు, ఎరవెల్లి వెంకటరమణావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మధు, మండలాధ్యక్షులు కొండాపురం బాల్‌రెడ్డి, కలకొండ కిషన్‌రావు, వల్లకొండ వేణుగోపాలరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు గజభీంకార్ రాజన్న, వర్స కృష్ణహరి, సురేందర్‌రావు, మేడుదుల మల్లేశం, మాజీ చైర్పర్సన్ లింగం రాణి, వైస్‌ఎంపీపీలు అంజయ్య, నాగయ్య, భూమ య్య, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్లు చింత పెల్లి వేణురావు, శీలం జనాబాయి, కవంపల్లి లక్ష్మి, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆకుల భూమ క్క, డీఎస్పీ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమాండెంట్ కాళి దాసు, కోఆప్షన్ సభ్యుడు బాలయ్యగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నేవూరి పోచిరెడ్డి, యాది మల్లేశ్‌యాదవ్, అంజన్‌రావు, యాదగిరిగౌడ్, కొమ్ము బాలయ్య, సంతోష్‌రావు కత్తెరపాక కొండయ్య ఉన్నారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు