శనివారం 06 మార్చి 2021
Rajanna-siricilla - Jan 26, 2021 , 02:10:08

పేదల పక్షపాతి కేసీఆర్‌

పేదల పక్షపాతి కేసీఆర్‌

సిరిసిల్ల రూరల్‌, జనవరి 25: సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి అని ఎంపీపీ పడిగెల మానస కొనియాడారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా తంగళ్లపల్లికి చెందిన ఎం నవ్యకు 17,500, జీ నర్సయ్యకు 15,500, ఏ రామారెడ్డికి 28వేలు, బీ హరీశ్‌కు 60వేలు, ఆనందంగౌడ్‌కు 35వేలు, టీ రామవ్వకు 30వేల విలువైన చెక్కులను సోమవారం అందజేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, ఎంపీటీసీ కోడి అంతయ్య, మాజీ సర్పంచ్‌ అంకారపు రవీందర్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, పడిగెల రాజు, ఆసాని లక్ష్మారెడ్డి, బొల్లారం చంద్రమౌళి,  జగత్‌కుమార్‌, పరశురాములు, సుధాకర్‌ ఉన్నారు.

ఎల్లారెడ్డిపేట, జనవరి 25: బొప్పాపూర్‌కు చెందిన చల్ల రజిత, బుర్రవేణి శ్రీలత, పోచంపల్లి రూప, చల్ల రాజుకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన 77వేల విలువైన చెక్కులను ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలితో కలిసి సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొం డాపురం బాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఇక్కడ నాయకులు ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మనవేని కృష్ణ, ముత్యాల శేఖర్‌రెడ్డి, పోచంపల్లి సాయిలు ఉన్నారు. 

VIDEOS

logo