మంగళవారం 02 మార్చి 2021
Rajanna-siricilla - Jan 25, 2021 , 02:39:35

సబ్బండవర్గాలకు సమన్యాయం

సబ్బండవర్గాలకు సమన్యాయం

  • అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు హర్షణీయం 
  • సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం 
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి

సిరిసిల్ల టౌన్‌/సిరిసిల్ల రూరల్‌/ ఎల్లారెడ్డిపేట/ వీర్న పల్లి/ముస్తాబాద్‌, జనవరి 24: కేసీఆర్‌ పాలనలో సబ్బండవర్గాల ప్రజలకు సమపాధ్యానతతో ప్రభు త్వ ఫలాలు అందుతున్నాయని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చిక్కాల రామారావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదల కు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం వారు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఇక్కడ మ్యాన రవి, యూసుఫ్‌, సలీం, సత్తార్‌, సాధిక్‌, అక్రం, మహమూద్‌, మునీర్‌, రఫియొద్దీన్‌, షఫీ తదితరులు ఉన్నారు. సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్‌, ఓసీ సంఘం నేత సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీకి సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, వెలమ సంక్షేమ మండలి జిల్లా, గౌరవాధ్యక్షులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణాల పేదలకు మేలు చేకూరేలా రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని వారు చెప్పారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ రాజిరెడ్డి, వైస్‌ ఎంపీపీ జంగిటి అంజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, బుస్స లింగం, జూపల్లి రాజేశ్వర్‌రావు, సురభి నవీన్‌రావు, మిట్టపల్లి జవహర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, విఠల్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి ఉన్నారు. నేరెళ్లలో సింగిల్‌విండో డైరెక్టర్‌ తాండ్ర రవీందర్‌రావు, మాజీ ఉప సర్పంచ్‌ అశోక్‌రావు, రాంగోపాల్‌రావు, వెన్నమనేని రామారావు, శ్రీనివాసరావు, జిల్లా దివ్యాంగ సమితి అధ్యక్షుడు దొంతినేని చంద్రరావు ఆధ్వర్యం లో, తంగళ్లపల్లిలో శ్రీ వేద గాయత్రి బ్రాహ్మణ పరిషత్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కుటుంబాలు సుఖ సంతోషాలతో బాగుండాలని వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. ఇక్కడ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ బుగ్గ కృష్ణమూర్తి శర్మ, దిగుళ్ల రవీందర్‌శర్మ, తంగుడిగ కృష్ణమూర్తి ఉన్నా రు. అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌తో నాయకులతో కలిసి జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ బ్రాహ్మణ ప్రతినిధులు దయానందశర్మ, రాముశర్మ, గుండ య్య పంతులు, బుగ్గ శ్రీనివాస్‌శర్మ, వైశ్య ప్రతినిధులు బొమ్మకంటి రవిగుప్తా, బొమ్మకంటి రాజయ్యగుప్తా, భాస్కర్‌గుప్తా, రెడ్డి సంఘం ప్రతినిధులు జంగ అంజిరెడ్డి, దొంతి రామకృష్ణారెడ్డి, సద్ది నర్సింహారెడ్డి, ముస్లిం ప్రతినిధులు జాఫ ర్‌, లాల్‌మహ్మద్‌, సర్పంచులఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు నేవూరి వెంకటనర్సింహారెడ్డి ఉన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, నాయకులు నాగేశ్వర్‌రావు, రాజిరెడ్డి, మల్లేశం, మల్లారెడ్డి, రాజిరెడ్డి పాలాభిషేకం చేశారు. ముస్తాబాద్‌లో టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీ కి క్షీరాభిషేకం చేశారు. ఇక్కడ జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు గాండ్ల సుమతి, దమ్మ రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్‌రావు, నాయకులు అంజిరెడ్డి, భరత్‌, సంతోష్‌రావు, ఉల్లి మల్లేశ్‌ యాదవ్‌, చెవుల మల్లేశ్‌ యాదవ్‌, ఏనుగు వేణు, అనంద్‌రావు, అంజన్‌రావు, బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రామశర్మ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo