మంగళవారం 02 మార్చి 2021
Rajanna-siricilla - Jan 25, 2021 , 02:39:33

రాజన్న ఆలయంలో రద్దీ

రాజన్న ఆలయంలో రద్దీ

  • 10వేలకు పైగా మంది  రాక 
  • సమకూరిన 9లక్షల ఆదాయం 

వేములవాడ టౌన్‌, జనవరి 24: వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం రద్దీ గా కనిపించింది. భక్తులు వేకువజాము నుంచే కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 10వేలకు పైగా మంది  దర్శించుకోగా, వివిధ ఆర్జిత సేవల ద్వారా సుమారు రూ.9లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారిని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారి సుబ్బారెడ్డి ఐపీఎస్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇక్కడ పర్యవేక్షకులు శ్రీరాములు, రాజశేఖర్‌, పీఆర్వో చం దు, శివప్రసాద్‌ ఉన్నారు. ఆలయంలో మూలమూర్తి వెనుక కైలాసగిరి ఏర్పాటు కు ఏడు కిలోల వెండిని వరంగల్‌కు చెందిన డాక్టర్‌ దీపక్‌ శోదన్‌ వితరణ చేశారు. అద్దాల మండపంలో ఈఈ రాజేశ్‌కు ఆయన వెండి బిల్లలను అందజేశారు.

VIDEOS

logo