మంగళవారం 02 మార్చి 2021
Rajanna-siricilla - Jan 25, 2021 , 02:39:33

ఆపన్నహస్తం అందించండి

ఆపన్నహస్తం అందించండి

వీర్నపల్లి, జనవరి 24: గర్జనపల్లికి చెందిన గుంటుక రాజేందర్‌-రేణుక దంపతులు. కూలీ పనులు చేసుకుంటా జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇటీవలే బాలుడు (45 రోజులు) జన్మించాడు. పుట్టిన రెండు రోజులకు బాలుడు అనారోగ్యానికి గురికావడంతో కరీంనగర్‌లోని ఓ దవాఖానలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి గుండెకు రంధ్రం పడినట్లు గుర్తించారు. దీనికి తోడు రక్తప్రసరణ కాకపోవడంతో శరీరం ఇన్‌ఫెక్షన్‌కి గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని, ఆపరేషన్‌కు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వైద్య చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు A/C:79031980702, IFSC Code:SBI N0RRDCGB, గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్‌ 85004- 01729  ద్వారా సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


VIDEOS

logo